Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్షయ తృతీయ రోజున గోమాతను పూజిస్తే.. ఎంత మేలో తెలుసా?

అక్షయ తృతీయ రోజున గోమాతను పూజిస్తే.. ఎంత మేలో తెలుసా?
, మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (14:11 IST)
అక్షయ తృతీయ తెల్లవారు జామున గోమాతను పూజ చేయడం విశేషం. గోమాతు గోధుమలు, పొట్టు, బెల్లం, అరటిపండు కలిపిన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున పసుపు, కుంకుమలు ఇతరులకు ఇవ్వడం మంచిది. అన్నదానం చేయడం ద్వారా దేవతలకే అన్నం పెట్టిన ఫలితం దక్కుతుందని విశ్వాసం. ఈ రోజున పేదలకు కావాల్సిన వస్తువులను దానం చేస్తే రాజయోగం లభిస్తుందని భక్తుల విశ్వాసం. 
 
వస్త్రాలు దానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. రోగాలు దరిచేరవు. మజ్జిగ లేదా నీటిని దానం చేస్తే విద్య ప్రాప్తిస్తుంది. పెరుగుదానం చేస్తే పాప విమోచనం లభిస్తుంది. ఆహార ధాన్యాలు దానం చేస్తే ప్రమాదాలు, అకాల మరణాలు వంటివి దూరమవుతాయి. 
 
గోమాతలో దేవతలందరూ ఉంటారు కాబట్టి అరటిపండు ఇవ్వడం మంచిది. ఆకలితో అలమటించేవారికి అక్షయ తృతీయ రోజున అన్నదానం చేస్తే ముక్తి లభిస్తుందట. వారికి మరో జన్మ ఉండదట. నేరుగా శివసాన్నిధ్యం చేరుకుంటారట. అక్షయ తృతీయ రోజున వస్త్రాలను దానం చేస్తే చంద్రుడు ప్రసన్నుడై సకల సంపదలను ఇస్తాడట. దీంతో పాటు బెల్లం, నెయ్యి, పరమాన్నం కూడా దానం చేస్తే మరింత ఫలితం కలుగుతుందట. 
 
అక్షయతృతీయ రోజున నీటిని నువ్వులతో కలిపి దానం ఇస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని పద్మపురాణంలో వుంది. అనుకోకుండా, తెలియకుండాచేసిన తప్పులకు మాత్రమే ఇలా పరిహారం అవుతుందట. కనుక అలాంటి తప్పులు చేసినవారు అక్షయ తృతీయ ఆ దానం ఇచ్చి చూస్తే ఫలితం కనబడుతుంది. 
 
అక్షయ తృతీయ రోజున అవసరం వున్నవారికి ఔషధాలను దానం ఇస్తే ఆయురారోగ్యాలు కలిగి, అనారోగ్య సమస్యలు పోతాయని పురాణాలు చెబుతున్నాయి. బియ్యం, వెండి, పంచదార దానం చేయడంవల్ల కలిగే ఫలితాల గురించి ఆదిత్య పురాణంలో చెప్పబడింది. 
 
ఈ దానాల వలన మీ జాతకంలో వున్న చంద్రుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి. వెండి దానం చేస్తే శివుడు సంతోషిస్తాడు. సకల శుభాలు కలిగేలా అనుగ్రహిస్తాడట. మామిడి పండ్లు, విసనకర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్యం లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్షయ తృతీయ రోజున మంచి నీటిని దానం చేయాలట..