Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడు రాత్రులు నేల మీద నిద్రించి.. గోమాతను దానం చేస్తే..?

Advertiesment
Godanam
, గురువారం, 7 మార్చి 2019 (14:41 IST)
గోమాతను పూజించడం ద్వారా కోటి పుణ్యల ఫలం పొందవచ్చు. కన్నతల్లి తర్వాత గోవునే మాతగా పిలుస్తారు. అలాంటి గోవును దానం చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలను పొందవచ్చో చూద్దాం.. ప్రతి ఒక్కరూ జీవితకాలంలో మూడు గోవులను దానంగా చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇలాచేస్తే పుణ్యఫలంతో పాటు సమస్త దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
ముఖ్యంగా మరణానంతరం 'వైతరణి' నదిని దాటే క్రమంలో అత్యంత కష్టతరమైన ప్రయాణం చేయకుండా ఈ పుణ్య ఫలం అడ్డుపడుతుంది. ఇక గోవును దానం చేయడం వలన, కొన్ని వేల సంవత్సరాల పాటు పితృదేవతలు ఉత్తమ గతులను పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. 
 
గోదానం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అనారోగ్యాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు వుండవు. వంశాభివృద్ధి చేకూరుతుంది. అలాంటి గోదాన ప్రాధాన్యాన్ని అంపశయ్యపై వున్న భీష్ముడు ధర్మరాజుకు వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
శుభసమయాల్లో గోదానం చేయడం ద్వారా పుణ్యగతులను పొందవచ్చునని.. మూడు రాత్రులు నేల మీద నిద్రించి.. గోదానం చేయాలి. కేవలం నీటిని మాత్రం సేవించి ఉపవాసం వుండి.. గోదానం చేస్తే మంచి ఫలితాలుంటాయి. దూడలను కూడా దానం చేస్తే.. ఉత్తమ ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హనుమంతుని శరీరమంతా సిందూరం ఉంటుంది.. ఎందుకు..?