Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే? ఇలా చేయండి

శనిప్రభావ తీవ్రతను తగ్గించుకోవాలంటే.. విష్ణుసహస్రనామం, ఆదిత్య హృదంయం, సుందరకాండ పారాయణం చేయాల్సిందేనని పండితులు చెప్తున్నారు. ప్రతిశనివారం శనిదేవునిని ఆరాధించడం, నవగ్రహాల్లో శనీశ్వరుని ముందు నువ్వులనూ

ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే? ఇలా చేయండి
, గురువారం, 1 జూన్ 2017 (13:48 IST)
శనిప్రభావ తీవ్రతను తగ్గించుకోవాలంటే.. విష్ణుసహస్రనామం, ఆదిత్య హృదయం, సుందరకాండ పారాయణం చేయాల్సిందేనని పండితులు చెప్తున్నారు. ప్రతిశనివారం శనిదేవునిని ఆరాధించడం, నవగ్రహాల్లో శనీశ్వరుని ముందు నువ్వులనూనెతో దీపం వెలిగించాలి. పక్షులకు ఆహారం వేయడం, పరమేశ్వరుని పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ద్వారా శనీశ్వరుడు శుభఫలితాలను ఇస్తాడు. 
 
యాచకులకు, వికలాంగులకు పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుముఖం పడుతుంది. శనీశ్వర ప్రభావం తగ్గాలంటే ఈశ్వరాధన, హనుమంతుడి ఆరాధన చేయాలి. ఏలినాటి శని ప్రభావం ఏడున్నర ఏళ్లు వుంటుంది కాబట్టి, శని పాపగ్రహం కావున కష్టాలను ఇస్తాడు. ఈ గ్రహం రాశిలో వున్నప్పుడు ప్రాణభయం, ధనం లేకపోవడం, అధమ స్థానానికి వెళ్ళిపోవడం వంటివి జరుగుతుంటాయి. 
 
అయితే శని మన రాశిలో ప్రవేశిస్తే కొన్ని మంచి పనులు కూడా చేస్తాడు. వివాహం, ఇంటి నిర్మాణం, ఉద్యోగం లాంటివి జరిపిస్తాడు. కానీ వాటి వెనక అధిక ఖర్చు వంటి ఇబ్బందులు సృష్టిస్తాడు. అందుకే ఇలాంటి కష్టాల నుంచి గట్టెక్కాలంటే శనివారం శనీశ్వర పూజ చేసి ఆయన్ని శాంతింపజేయాలి. నువ్వులనూనె, శంఖుపువ్వులను సమర్పించి ప్రార్థించాలి. ఇలా చేస్తే శని గ్రహ ప్రభావం తగ్గుతుంది. ఈతిబాధలు సైతం తొలగిపోతాయని పండితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటికి ఈశాన్యంలో మారేడు చెట్టు వుంటే...?