Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈరోజు మీ రాశిఫలితాలు... (30-07-17)... ఈ వార మీ రాశిఫలితాలు... వీడియో

మేషం : ఈరోజు దూరపు బంధువుల ప్రోత్సాహంతో పనులలో పురోభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులు వివాదాస్పదమైన వ్యాక్యలు చేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు.

ఈరోజు మీ రాశిఫలితాలు... (30-07-17)... ఈ వార మీ రాశిఫలితాలు... వీడియో
, ఆదివారం, 30 జులై 2017 (05:39 IST)
మేషం : ఈరోజు దూరపు బంధువుల ప్రోత్సాహంతో పనులలో పురోభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులు వివాదాస్పదమైన వ్యాక్యలు చేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. 
 
వృషభం : మీరు ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినీ దూషించకపోయినా ఎదుటివారి అపోహలకు లోనయ్యే అవకాశం ఉంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. స్థిరాస్తుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. సోదరీ, సోదరుల వ్యవహారాల్లో ఊహించని మార్పులు కానరాగలవు. 
 
మిథునం : మీ గౌరవానికి భంగం కలిగించే సంఘటనలెదురవుతాయి. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. మత్స్యు, కోళ్ల, గోర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. కంప్యూటర్, ఎలక్ట్రికల్ రంగాలలో వారికి పనివారితో సమస్యలు తలెత్తగలవు. 
 
కర్కాటకం : మీ వ్యవహారజ్ఞానం, సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులకు లోనవుతారు. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కుటుంబీకుల మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. మీ చిన్నారుల గురించి మంచి మంచి పథకాలు, ప్రణాళికలు వేస్తారు. 
 
సింహం : ఒకేసారి అనేక పనులు మీదపడటంతో ఒకింత అసహనానికి గురవుతారు. ఆరోగ్యం విషయంలోనూ, చాలా మెళకువ అవసరం. కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. 
 
కన్య : దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఆత్మీయులను విమర్శించడం మంచిదికాదని గమనించండి. మీ ఆంతరింగిక విషయాలను బయటకు వ్యక్తం చేయకండి. సినిమా కళాకారులకు అపవాదులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. స్త్రీల అభిప్రాయాలకు మంచిస్పందన లభిస్తుంది. 
 
తుల : ఉమ్మడి వ్యవహారాలు, ఆస్తి పంపకాలు ఒక కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. మిత్రుల వల్ల అపనిందలు, అపవాదులు ఎదుర్కొంటారు. నూతన పరిచయాలు, వ్యాపకాలు మీ పురోభివృద్ధికి నాందిపలుకుతారు. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. 
 
వృశ్చికం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. నిగ్రహం పాటించడం క్షేమదాయకం. వాహనం, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. 
 
ధనస్సు : రుణ, విదేశీయాన యత్నాల్లో ఆటంకాలెదుర్కొంటారు. కుటుంబ వ్యవహారాలలో కానీ, శారీరకంగా, మానసికంగా శ్రమిస్తారు. మతపరమైన విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కొంతమంది మిమ్మలను ఉద్రేకపరిచేలా సంభాషిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. 
 
మకరం : రాజకీయనేతలు తరచూ సభలు, యూనియన్ సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారిపట్టే ఆస్కారం ఉంది. బంధువులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. 
 
కుంభం : మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రముఖుల కలయిక కోసం అధిక సమయం వెచ్చిస్తారు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
మీనం : విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలలో ఎక్కువ పాములు కనిపిస్తున్నాయా? సర్పదోషాలకు ఇలా చేయండి