Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ రోజు మీ రాశి ఫలితాలు 26-07-2017, ఓర్పు నేర్పుతో సాధించండి...

మేషం : ఈరోజు వస్త్ర, వెండి, బంగారం, పచారీ, ఫ్యాన్సీ, స్టేషనరీ, మందులు, ఆల్కాహాలు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలు, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు. పాత వస్తువులను

Advertiesment
Today Predictions
, బుధవారం, 26 జులై 2017 (05:07 IST)
మేషం : ఈరోజు వస్త్ర, వెండి, బంగారం, పచారీ, ఫ్యాన్సీ, స్టేషనరీ, మందులు, ఆల్కాహాలు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలు, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల భంగపాటుకు గురవుతారు. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. విద్యార్థినిలు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
వృషభం : ఈరోజు కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. ఉద్యోగ ప్రయత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేక పోతారు.
 
మిథునం : ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కలవు. పెన్షన్, బీమా సమస్యలు పరిష్కారం అవుతాయి. స్త్రీలు, షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. ఓర్పుతో ప్రయత్నిస్తే లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. కళాశాలలో ప్రవేశాలకు, కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు అనుకూల సమయం.
 
కర్కాటకం : ఈ రాశివారికి ఈరోజు గృహనిర్మాణం, ఫర్నీచర్ కొనుగోలుకు నిధులు సమకూర్చుకొనుటలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రముఖులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి సహకరిస్తాయి. చిన్నారుల, విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలలో ఖర్చులు అంచనాలు మించుతాయి. బంధువుల కలయికతో నూతనోత్సాహం కానవస్తుంది.
 
సింహం : ఈరోజు చేతి వృత్తుల వారికి ఇబ్బందులు తప్పవు. అంచనాలు తలక్రిందులయ్యే అవకాశం ఉంది. సమావేశాలను ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వాతావరణంలోని మార్పులవల్ల మీ పనులు వాయిదాపడతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
కన్య : ఈరోజు ఆర్థిక విషయాలలో ఏకాగ్రత అవసరం. మీకు కాలం అనుకూలంగా ఉన్నట్లు తోస్తుంది. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. సన్నిహితుల కోసం ధన బాగా వ్యయం చేస్తారు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
తుల : ఈ రాశివారికి ఈరోజు ఇరుగు, పొరుగువారితో కలహాలు తలెత్తుతాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిదికాదని గమనించండి. మత్స్యు కోళ్ళ వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. మీ సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం.
 
వృశ్చికం : ఈరాశివారికి ఆర్థిక వ్యవహారాలలో పురోభివృద్ధి. సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యుల నుంచి వార్తలు అందుకుంటారు. నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొంటారు. ధనం మంచినీళ్ల ప్రాయంగా ఖర్చవుతుంది.
 
ధనస్సు : ఈరోజు చిన్నతరహాపరిశ్రమలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. కోర్టు వ్యవహారాలు, భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మిమ్మలను తక్కువ అంచనా వేసిన వారే మీ సమర్థతను గుర్తిస్తారు. నిరుద్యోగులకు అశాజనకం. వడ్డీలు, డిపాజిట్లు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
 
మకరం : ఈరోజు విద్యార్థులకు రెండో విడత కౌన్సిలింగ్‌ అనుకూలిస్తుంది. దైవ, సేవ, పుణ్యకార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహనచోదకులకు ఆటుపోట్లు తప్పవు. కోర్టుతీర్పులు, పెద్దల నిర్ణయం మీకు అనుకూలంగానే ఉంటాయి. 
 
కుంభం : ఈరోజు కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు, వాణిజ్య ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో సావదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అతిథిమర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. ఉన్నతాధికారులు ధనప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
 
మీనం : మీనరాశివారికి ఈ రోజు దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెరుగుతాయి. ఆపదసమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. స్త్రీలకు బంధువులతో పట్టింపులు ఎదురవుతాయి. మీపనులు మందకొడిగా సాగుతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళ, శుక్రవారాల్లో రుణం ఇస్తే.. సూర్యాస్తమయం తర్వాత డబ్బు ఇస్తే?