Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ రాశి ఫలితాలు(6-7-2017)... అధికారుల నుంచి మంచి గుర్తింపు....

మేషం: స్థిరాస్తి కొనుగోళ్ళకు సంబంధించిన వ్యవహారాలు వాయిదాపడతాయి. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. ఉద్యోగ, వృత్తుల వారికి ఆశించిన పురోభివృద్ధి ఉండదు. స్త్రీలు, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. రావలసిన ధనం చేతికందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్త

మీ రాశి ఫలితాలు(6-7-2017)... అధికారుల నుంచి మంచి గుర్తింపు....
, బుధవారం, 5 జులై 2017 (23:08 IST)
మేషం:
స్థిరాస్తి కొనుగోళ్ళకు సంబంధించిన వ్యవహారాలు వాయిదాపడతాయి. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. ఉద్యోగ, వృత్తుల వారికి ఆశించిన పురోభివృద్ధి ఉండదు. స్త్రీలు, విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. రావలసిన ధనం చేతికందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కోర్టుకు హాజరవుతారు. 
 
వృషభం
ధనాన్ని మంచినీళ్ళప్రాయంగా ఖర్చు చేస్తారు. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. లౌక్యంగా వ్యవహరించి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు. రావలసిన మొండి బాకీలు వాయిదాపడతాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీలో దయాగుణం వికసిస్తుంది. 
 
మిథునం
చేపట్టిన పనులలో అవాంతరాలు ఎదురైనా మొండి ధైర్యంతో శ్రమించి పూర్తి చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారితో విభేదాలు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 
 
కర్కాటకం
ఉద్యోగస్తుల శ్రమను అధికారులు గుర్తిస్తారు. స్త్రీల తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. విలువైన పత్రాలు చేజార్చుకుంటారు. ఆపత్సమయంలో ఆత్మీయులు అండగా నిలుస్తాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వైద్యులు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం. 
 
సింహం 
పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. ఆప్తులతో నిజాయితీగా మెలగండి. ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యుల సహకారం వల్ల సమసిపోతాయి. గృహంలో ఏవైనా వస్తువులు పోవుటకు ఆస్కారం కలదు. జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు అనుకూలం. 
 
కన్య
వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. స్త్రీలు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. 
 
తుల 
నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు వాయిదా పడతాయి. కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. రుణ ప్రయత్నాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. విద్యార్థుల పరిచయాలు మరింతగా బలపడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సలహా పాటిస్తారు. బ్యాంకు పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. 
 
వృశ్చికం
ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. గతంలోని వ్యక్తులు తారసపడతారు. ప్రేమికుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ముఖ్యమైన వ్యక్తుల కలయిక వల్ల మేలు జరుగుతుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. 
 
ధనస్సు
ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఐరన్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకం. ప్రముఖులను కలుసుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందించుట వల్ల మీకు సంఘంలో గొప్ప గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య చికాకులు తలెత్తుతాయి. 
 
మకరం
శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు, సంభాషణలు అనుకూలిస్తాయి. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. రాజకీయాల వారు కార్యకర్తల వల్ల సమస్యలను ఎదుర్కొనక తప్పదు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ లక్ష్యం నెరవేరదు. వాహనం నడుపునపుడు జాగ్రత అవసరం. 
 
కుంభం
ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. తెలిసి తెలియక చేసిన పనులు ఇబ్బందులు పెడతాయి. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. దైవకార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. 
 
మీనం
మిత్రుల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. బ్యాంకు వ్యవహారాల్లో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ రాశి ఫలితాలు (5-7-2017)... అనుకోని సదవకాశాలు...