Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం : ఈ రోజు మీ రాశి ఫలితాలు 11-09-17

మేషం: విలువైన కానుక ఇచ్చి మీ శ్రీమతిని ప్రసన్నం చేసుకుంటారు. దైవ, పుణ్య కార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. మీ మౌనం వారికి గుణపాఠం అవుతుంది. వేళ తప్పి ఆహారం భుజించడం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. ప

Advertiesment
శుభోదయం : ఈ రోజు మీ రాశి ఫలితాలు 11-09-17
, సోమవారం, 11 సెప్టెంబరు 2017 (05:39 IST)
మేషం: విలువైన కానుక ఇచ్చి మీ శ్రీమతిని ప్రసన్నం చేసుకుంటారు. దైవ, పుణ్య కార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. మీ మౌనం వారికి గుణపాఠం అవుతుంది. వేళ తప్పి ఆహారం భుజించడం వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. పాత శత్రువులు మిత్రులుగా మారుతారు. దూరప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి.
 
వృషభం: మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. రాబోయే కాలంలో ఖర్చులు, అవసరాలు మరింతగా పెరిగేందుకు ఆస్కారం ఉంది. పాడి పరిశ్రమ రంగాల్లో వారికి శ్రమ అధికం. ఆయిల్, నూనె, గ్యాస్ వ్యాపారస్తులకు పనివారితో ఇక్కట్లు తలెత్తగలవు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు.
 
మిథునం : భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడుతుంది. మిత్రులతో సంభాషించడం ద్వారా మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటాయి. విద్యా సంస్థల్లో వారికి ఉపాధ్యాయుల వల్ల ఇబ్బందులు తలెత్తగలవు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతుంది.
 
కర్కాటకం : కమ్యూనికేషన్ రంగాల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ప్రయాణాల్లో ఆశించినంత ఉత్సాహంగా సాగవు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ హోదాకు తగినట్టుగా ధనం వ్యయం చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా సంయమనంతో వ్యవహరించవలసి ఉంటుంది.
 
సింహం : విద్యుత్ లోపం అధికం కావడం వల్ల ఆందోళనకు గురవుతారు. రిప్రజెంటివ్‌లకు నిర్దేశించబడిన గమ్యానికి చేరలేకపోవడం వల్ల ఇబ్బందులకు లోనవుతారు. సంగీత, సాహిత్య అభిలాష పెరుగుతుంది. విదేశీ వస్తువుల ఆసక్తి పెరుగుతుంది. ప్రైవేట్ రంగాల్లో వారు మార్పులకోసం చేసే ప్రయత్నాలు అనుకూలించవు.
 
కన్య : రాజకీయాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. విద్యార్థులకు దూర ప్రదేశాల్లో పై చదువులకు అవకాశం లభిస్తుంది. ముఖ్యులతో మాట పట్టింపు వచ్చే ఆస్కారం ఉంది. మీ మనసు మార్పును కోరుకుంటుంది.
 
తుల: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన సమసిపోగలవు. బంధువుల రాక వల్ల చేపట్టిన పనులపై ఆసక్తి ఉండదు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ తొందరపాటుతనం వల్ల వ్యవహారం బెడసికొట్టే ఆస్కారం ఉంది. ఇప్పటి వరకు విరోధులుగా ఉన్న వ్యక్తులను సుముఖం చేసుకోగలుగుతారు.
 
వృశ్చికం : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్పు తిరగవలసి ఉంటుంది. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి.
 
ధనస్సు : వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థుల కంటే, విద్యార్థినులలో పురోభివృద్ధి కానవస్తుంది. సహకార సంఘాల్లో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఏదైనా స్థిరాస్తులు అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
మకరం : చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి ఒత్తిడి, వేధింపులు అధికమవుతాయి. రవాణా రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించినట్లైతే సద్వినియోగం చేసుకోవడం మంచిది. నిత్యావసర వస్తువులు, బియ్యం, ఉల్లి వ్యాపారులకు వేధింపులు, చికాకులు అధికం.
 
కుంభం : వాస్తవానికి మీరు నిదానస్తులైనప్పటికీ కొంత ఉద్రేకానికి లోనవుతారు. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడుతాయి. స్త్రీలు ఆడంబరాలు, విలాస వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు.
 
మీనం : వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు వ్యాపారాలు ఊపందుకుంటాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారిలో గుర్తింపు, ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంటుంది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి వేధింపులు అధికమవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సూర్యభగవానుడిని ఇలా పూజిస్తే.. గ్రహదోషాలుండవు..