Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం... ఈ రోజు రాశిఫలితాలు (04-08-2017)

మేషం : ఈరోజు విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలపై విశ్వాసం సన్నగిల్లుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. చేసే వృత్తి వ్యాపారాల యందు ప్రోత్సాహం, వాక్ చాతుర్యం ఉండును.

Advertiesment
daily prediction
, శుక్రవారం, 4 ఆగస్టు 2017 (05:37 IST)
మేషం : ఈరోజు విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలపై విశ్వాసం సన్నగిల్లుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. చేసే వృత్తి వ్యాపారాల యందు ప్రోత్సాహం, వాక్ చాతుర్యం ఉండును. చేతిలో ధనం నిలవటం కష్టమవుతుంది. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
వృషభం : ఈరోజు వైద్యులు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు మరింత బలపడతాయి. పత్రికా, ప్రైవేటు రంగాల వారికి ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. మీ తొందరపాటు నిర్ణయాలు మీకు ఎంతో ఆవేదన కలిగిస్తాయి.
 
మిథునం : ఈరోజు ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. కళ్యాణ మంటపాల కోసం అన్వేషిస్తారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. స్త్రీలు గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
 
కర్కాటకం : ఈరోజు వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. విరోధులు వేసే పథకాలు తెలివితో తిప్పికొట్టగలుగుతారు. రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
సింహం : ఈరోజు ఊహించని ఖర్చు వల్ల చేబదుళ్లు తప్పవు. మనసులో భయాందోళనలు అనుమానాలూ ఉన్నా, డాంబికం ప్రదర్శించి పనులు సాఫీగా పూర్తి చేస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. బ్యాంకు వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. బంధుమిత్రుల రాకతో సందడి నెలకొంటుంది.
 
కన్య : మీ శ్రీమతితో ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూలు వాయిదాపడతాయి. కొబ్బరి, పండ్లు, పూల చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. నేడు అనుకూలించని వ్యవహారం రేపు సానుకూలం కాగలదు. తొందరపాటుతనం వల్ల ధననష్టంతో పాటు మాటపడవలసి వస్తుంది.
 
తుల : రాబోయే ధనానికి ముందుగానే ఖర్చులు ఎదురవుతాయి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేక పోతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన సంప్రదాయాలు పాటిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ఎదుటివారితో క్లుప్తంగా సంభాషించండి. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు.
 
వృశ్చికం : ఈరోజు తలపెట్టిన పనులు అనుకున్న విధంగా సమయానికి పూర్తికాగలవు. పారిశ్రామికవేత్తలకు, కళ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. అందరితో వీలైనంత క్లుప్తంగా మాట్లాడండి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగానే ఉంటాయి. వాహనం నిదానంగా నడపండి. స్త్రీలు, వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
 
ధనస్సు : మీ పరోపకారబుద్ధి వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. సంఘంలో ఉన్నతస్థాయిలో వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధి నాంది పలుకుతారు. వృత్తులలో వారికి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. శ్రీవారు శ్రీమతిల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. నూతన పెట్టుబడులు పెట్టునపుడు పునరాలోచన అవసరం.
 
మకరం : ఈరోజు స్తిరాస్థి విక్రయంలో పునరాలోచన మంచిది. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం కూడదు. మీ అభిప్రాయాలకు తగినట్టుగా కొత్త వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి పనిఒత్తిడి, చికాకులు తప్పవు. మీ సమర్థతకు తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి.
 
కుంభం : ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు రుణంలో కొంతమొత్తం తీర్చగలుగుతారు. ఉద్యోగ విషయాల దృష్ట్యా తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన వ్యక్తులు సన్నిహితులవుతాయి. విద్యార్థులు బహుమతులు, ప్రశంసలు అందుకుంటారు. ఉపాధ్యాయులకు శ్రమకు తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి.
 
మీనం : సన్నిహితులతో మీ ఆర్థిక విషయాలను గురించి చర్చించవద్దు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బంగారు, వెండి, వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమువుతాయి. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. రిప్రజెంటేటివ్‌లకు పురోభివృద్ధి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కష్టాలు ఎదురయ్యాయని కర్తవ్యాన్ని విడిచిపెట్టకు(సాయి సూక్తులు)