Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం... ఈ రోజు(2-8-2017) రాశి ఫలితాలు ఇలా వున్నాయి

మేషం : ఈరోజు ఉపాధ్యాయులకు యాజమాన్యం నుంచి ఒత్తిడి, చికాకులు అధికవుతాయి. ముక్కుసూటిగా పోయే మీ తీరు ఇబ్బందులకు దారితీస్తుంది. హోటల్, తినుబండరాలు, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలకు

Advertiesment
daily prediction
, బుధవారం, 2 ఆగస్టు 2017 (05:39 IST)
మేషం : ఈరోజు ఉపాధ్యాయులకు యాజమాన్యం నుంచి ఒత్తిడి, చికాకులు అధికవుతాయి. ముక్కుసూటిగా పోయే మీ తీరు ఇబ్బందులకు దారితీస్తుంది. హోటల్, తినుబండరాలు, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలకు పనిభారం అధికవుతుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. 
 
వృషభం : ఈరోజు రాజకీయాల్లోని వారికి పార్టీ పరంగానూ, అన్నివిధాలా కలిసివస్తుంది. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆపత్సమయంలో సన్నిహితులు గుర్తుకొస్తారు. ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనపర్చడం వల్ల ఒత్తిడి, మందలింపులు ఎదుర్కోక తప్పదు. స్త్రీలకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
మిథునం : కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికం అవుతుంది. మీ శ్రీమతి అవసరాలు, కోరికలు తీరుస్తారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. స్త్రీల అభిప్రాయాలకు ఏమాత్రం స్పందన ఉండదు. 
 
కర్కాటకం : వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. మీతో సఖ్యతగా నటిస్తూనే తప్పుదారి పట్టించేందుకు కొంతమంది యత్నిస్తారు. అర్థాంతరంగా ముగించిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. 
 
సింహం : కొన్ని నచ్చని సంఘటనలు ఎదురైనా భరించక తప్పవు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. రాజకీయాలలో వారు కొన్ని అంశాలపై చర్య జరుపుటవల్ల జయం చేకూరుతుంది. స్త్రీలకు ఆలయాలలో సందర్శనాలలో నూతన పరిచయాలేర్పడతాయి. సోదరీ, సోదరులతో  ఏకీభవించలేక పోతారు. 
 
కన్య : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. బంధువుల ఆకస్మికరాక ఇబ్బంది కలిగిస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ ధ్యేయం నెరవేరుతుంది. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. 
 
తుల : ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు అనుకూలమైన కాలం. విదేశాలకు వెళ్లడానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. వ్యవసాయ, తోటల రంగాలవారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. బంధువుల రాకతో ఊహించని ఖర్చులు అధికమవుతాయి. 
 
వృశ్చికం : ప్రియతములిచ్చే సలహా మీకెంతో సంతృప్తినిస్తుంది. ప్రైవేటు, పత్రిక సంస్థలలోని వారికి, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, పనిభారం సమస్యలు తప్పవు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఖర్చులు మీ స్థోమతకు తగినట్టుగానే ఉంటాయి. 
 
ధనస్సు : ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ఫథకాలు మంచి ఫలితాలనిస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు నూతన పరిచయాలు, వాతావరణం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దక్కుతాయి. 
 
మకరం : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. అధైర్యం వదిలి ధైర్యంతో ముందుకుసాగి జయం పొందండి. సామాజిక, సేవా కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నరాలు, పొట్ట, కాళ్ళకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. 
 
కుంభం : ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పారిశ్రామిక రంగంలోని వారు కార్మికులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. దంపతుల మధ్య కొత్తకొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. 
 
మీనం : కష్టసమయంలో అయినవారే ముఖం చాటేస్తారు. కుటుంబసభ్యులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిటికీలు, తలుపులు ఎప్పుడూ మూసివుంచితే?