Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

27-10-2019 ఆదివారం మీ రాశిఫలాలు- ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయంలో..

Advertiesment
27-10-2019 ఆదివారం మీ రాశిఫలాలు- ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయంలో..
, ఆదివారం, 27 అక్టోబరు 2019 (09:05 IST)
మేషం : అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో సంప్రదింపులు, చర్చలు ఫలిస్తాయి. మీ బలహీనతలను కొంతమంది స్వార్ధానికి వినియోగించుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.
 
వృషభం : మీ శ్రీమతి మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. హోటల్, క్యాటరింగ్ పనివారలకు సదవకాశాలు లభిస్తాయి. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. నూతన ప్రదేశాల సందర్శనలు అనుకూలిస్తాయి. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
మిథునం : ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సమస్యలు చక్కబడతాయి. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయంలో ఏకాగ్రత వహించండి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు.
 
కర్కాటకం : చేపట్టిన ఉపాధి పథకాలు మందకొడిగా సాగుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ, చిరు వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఏ వ్యక్తిని అతిగా విశ్వసించటం మంచిది కాదు. సమయస్పూర్తితో వ్యవహరించి ఒక సమస్యను అధికమిస్తారు.
 
సింహం : ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్పురిస్తుంది. ధనవ్యయం అధికంగా ఉంటుంది. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారస్తులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. చీటికి మాటికి ఎదుటి వారిపై అనుమానం ప్రదర్శిస్తారు. ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు.
 
కన్య : స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల నీద మక్కువ పెరుగుతుంది. ఏజెంట్లు, బ్రోకర్లు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం మంచిది కాదు. ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి.
 
తుల : ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరీ, సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలో వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిది కాదు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.
 
వృశ్చికం : గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కొంత మెరుగనిపిస్తుంది. అకాల భోజనం, శారీరక శ్రమ వంటి ఇబ్బందులు ఎదుర్కుంటారు. మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. కష్ట సమయంలో బంధువులు అండగా నిలుస్తారు.
 
ధనస్సు : వ్యాపారాల్లో నష్టాలను కొంత మేరకు అధికమిస్తారు. గృహనిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. హోదాలో ఉన్న అధికారులు అపరిచితుల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఆస్కారం ఉంది. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. నిరుద్యోగులు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
మకరం : నూతన వ్యపారాలు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆత్మీయులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
 
కుంభం : బంధుమిత్రులతో సఖ్యత నెలకొంటుంది. స్త్రీలు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రతి విషయాన్ని మీ జీవిత భాగస్వామికి తెలియజేయటం మంచిది. నూతన పెట్టుబడులు వ్యవహారంలో ఒక నిర్ణయానికి వస్తారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ఆలయాలను సందర్శిస్తారు.
 
మీనం : వివాహ ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరగలవు. మీ యత్నాలు ఫలించకపోవడంతో నిరుత్సాహం చెందుతారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి సదవకాశాలు లభిస్తాయి. స్థోమతకు మించిన వాగ్దానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటారు. అనుకున్న పనులు అర్థాంతంగా ముగిస్తారు. కళ, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావళి అభ్యంగన స్నానం ఎందుకు చేయాలి?