Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

21-09-2018 - శుక్రవారం దినఫలాలు - అనుకున్న పనులు ఆశించినంత...

మేషం: దైవ, సేవా, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ప్రేమికులకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు ఇతరుల ఆంతరంగ

Advertiesment
21-09-2018 - శుక్రవారం దినఫలాలు - అనుకున్న పనులు ఆశించినంత...
, శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (08:54 IST)
మేషం: దైవ, సేవా, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ప్రేమికులకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చడం వలన మాటపడతారు. స్త్రీలు టి.వి.,ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు.
 
వృషభం: ఉద్యోగస్తులకుపై అధికారుల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు చేపట్టిన పనికి ఇతరుల నుండి అవాంతరాలు ఎదుర్కుంటారు. సోదరీసోదరుల మధ్య కలహాలు తలెత్తుతాయి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది. రాజకీయాలలోని వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి.  
 
మిధునం: ఉద్యోగంలో శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి రాగలవు. గతఅనుభవాలు జ్ఞప్తికి రాగలవు. విదేశాలు వెళ్ళే ఆలోచన క్రియారూపం దాల్చుతుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం.    
 
కర్కాటకం: చిన్నతరహా, చిరువృత్తుల వారికి శ్రమాధిక్యత. ఆర్థిక సంతృప్తికానరాదు. హామీలు ఉండడం మంచిది కాదని గ్రహించండి. కాంట్రాక్టర్లకు నిర్మాణ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదా పడడం మంచిది. ఉత్తర ప్రత్యుత్తరాలలో మెళకువ వహించండి. దైవదర్శనాలు చేస్తారు.  
 
సింహం: అనుకున్న పనులు ఆశించినంత సంతృప్తినివ్వవు. ఖర్చుల విషయంలో ఏకాగ్రత వహించండి. ప్రయాణాలు, మీ కార్యక్రమాలు వాయిదా పడడం మంచిది. బంధువర్గాల నుండి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. విద్యార్థుల ఆలోచనలు పక్కదోవ పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. 
 
కన్య: వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ రంగాల్లో వారికి కలిసిరాగదలు. స్పెక్యులేషన్ రంగాలవారికి కొత్త కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. మీ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయడం వలన భంగపాటు తప్పదు. స్త్రీలకు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. సంగీత, సాహిత్య, కళారంగాల్లో వారికి తగిన గుర్తింపు లభిస్తుంది.  
 
తుల: వైద్య రంగాల్లో వారికి శస్త్రచికిత్సల విషయంలో ఏకాగ్రత అవసరం. ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. ఆత్మీయుల రాకతో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. ఆస్తివివాదాల నుండి బయటపడుతారు. 
 
వృశ్చికం: వస్త్ర, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్లు పొందుతారు. సాహిత్య, కళా రంగాల్లో వారిక గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఉమ్మడి వ్యవహారాలు, భాగస్వామిక వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. 
 
ధనస్సు: దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడుతారు. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహా మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరచరాస్తుల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారితో మెళకువ అవసరం. బంధుమిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో అలక్ష్యం తగదు.   
 
మకరం: ఆర్థిక విషయాల్లో కొంత సంతృప్తి కానవస్తుంది. చిన్నతరహా, వృత్తి వ్యాపారాలు సజావుగా జరుగుతాయి. మీ జీవితభాగస్వామిలో మార్పు మీకెంతో ఊరటనిస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు. భూవివాదాలు, స్థిరాస్తి వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించండి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి.    
 
కుంభం: వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. స్టాక్‌మార్కెట్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. స్వల్ప అసస్థతకు గురవుతారు. విద్యార్థులకు ఉన్నత చదువుల్లో అవకాశం లభిస్తుంది. ముఖ్యుల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి తప్పదు.  
 
మీనం: నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణనకు మరికొంతకాలం వేచియుండడం మంచిది. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఇబ్బందులుండవు. కోర్టు వ్యవహారాలు సుదీర్ఘంగా సాగుతాయి. స్త్రీల అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏకాంతంలో భగవంతుని ప్రార్థించటమే మేలు