Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

16-07-2020 గురువారం రాశిఫలాలు - కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు..

16-07-2020 గురువారం రాశిఫలాలు - కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు..
, గురువారం, 16 జులై 2020 (05:00 IST)
మేషం : సిమెంట్, ఐరన్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ప్రేమికుల మధ్య అవగాహన కుదరదు. చేతి వృత్తుల వ్యాపారాల్లో పురోభివృద్ధి. మెడికల్, శాస్త్ర, వాణిజ్య రంగాల వారికి శుభదాయకం. స్త్రీలతో మితంగా సంభాషించండి. మీ ప్రత్యర్థుల ఎత్తుగడలను ధీటుగా ఎందుర్కొంటారు. 
 
వృషభం : ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్థంగా పరిష్కరిస్తారు. మీరు అభిమానించే వ్యక్తి నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్త షేర్ల కొనుగోళ్ళలో పునరాలోచన అవసరం. రాబడికి మించిన ఖర్చులు అవుతాయి. భాగస్వామిక, సొంత వ్యాపారాల్లో ఏకాగ్రత అవసరం. 
 
మిథునం : ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. దంపతుల మధ్య నూతన విషయాలు ప్రస్తావనకు పస్తాయి. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. 
 
కర్కాటకం : గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు అధికారులను మెప్పించడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. నూతన పరిచయాలేర్పడతాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోడం వల్ల భంగపాటుకు గురవుతారు. 
 
సింహం : సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా సహాయం అందిస్తారు. చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశీయానం, రుణ యత్నాల్లో చికాకులు తప్పవు. వాహనం ఇతురులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కన్య : ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కివస్తాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. దైవ కార్యాలలో చురుకుగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 
 
తుల : ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు పని ఒత్తిడి వల్ల ఆరోగ్యంలో ఒత్తిడి, చికాకులు తప్పవు. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేవలసి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. గొప్ప గొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. 
 
వృశ్చికం : దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులు త్వరితగతిన పాల్గొంటారు. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. ఆస్తి, భూ వివాదాలు, కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఊహించని వ్యక్తుల నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. స్పెక్యులేషన్ లభిస్తుంది. 
 
ధనస్సు : ఉన్నతస్థాయి ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో మెలకువ వహించండి. బంధు మిత్రుల కలయికతో నూతన ఉత్సాహం కానవస్తుంది. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యక, ప్రయాసలెదుర్కొంటారు. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. 
 
మకరం : లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. మీ యత్నాలు కొంత ఆలస్యంగానైనా పరిపూర్ణంగా పూర్తవుతాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. కోర్ట వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. స్త్రీలకు మితంగా సంభాషించండి. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. 
 
కుంభం : ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. 
 
మీనం : దైవ, సేవా కార్యక్రమాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. ప్రేమికులకు ఎడబాటు, ఊహించని చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆవనూనె, పామాయిల్‌తో దీపమెలిగించారో.. ఇక అంతే సంగతులు?!