Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

16-03-2020 సోమవారం దినఫలాలు - శంఖరుడిని పూజించినా సంకల్పసిద్ధి

webdunia
సోమవారం, 16 మార్చి 2020 (05:00 IST)
మేషం : బృంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. పన్నులు, బీమా, బిల్లుల పరిష్కారం అవుతాయి. మీ అతిథి మర్యాదలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. బ్యాంకు వ్యవహారాలలో మందకొడిగా సాగుతాయి. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహకరం. 
 
వృషభం : వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి శుభదాకయం. ఆత్మీయుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. అధిక ఉష్ణం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. నిర్మాణ పనులు, గృహ మరమ్మతులలో ఏకాగ్రత వహించండి. కోర్టు వ్యవహారాల్లో సంతృప్తికానరాదు. స్త్రీల తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. 
 
మిథునం : ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం లోపిస్తుంది. దృఢ సంకల్పంతో ముందుకుసాగండి. మీ కళత్ర మొండివైఖరి వల్ల ఇబ్బందులకు గురవుతారు. చిట్స్, పైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి పనిభారం అధికం కాగలదు. ఉద్యోగస్తులు మార్పులకై చేయు యత్నాలు ఒక కొలిక్కిరాగలవు. 
 
కర్కాటకం : ఆర్థిక స్థితిలో ఏమాత్రం పురోభివృద్ధి ఉండదు. దైవ, సేవా, పుణ్యకార్యాలలో నిమగ్నమవుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలకు ఆడంబరాలు, విలాసాల పట్ల ఆసక్తి వస్తుంది. కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. 
 
సింహం : ఆదాయవ్యయాల్లో సమతుల్యత ఉంటుంది. బ్యాకింగ్ వ్యవహరాల్లో మెలకువ వహించండి. పొట్ట నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత లోపిస్తుంది. మీ సంతానం కోసం అధికంగా శ్రమిస్తారు. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. 
 
కన్య : మీ సంతానంతో ఉల్లాసంతో గడుపుతారు. ఏజెన్సీ, లీజు, నూతన కాంట్రాక్టులకు సంబంధించి కొన్ని ప్రతికూలత లెదురవుతాయి. వైద్య, వైజ్ఞానిక రంగాలలోని వారికి జయం చేకూరుతుంది. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి గురవుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో సమయస్ఫూర్తితో వ్యవహరించడం మంచిది. 
 
తుల : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అసరం. బంధు మిత్రులతో విభేదాలు తీరతాయి. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. రుణాలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఓర్పు, నేర్పుతో వ్యవహరించండి. 
 
వృశ్చికం : ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనివారలతో చికాకులు తప్పవు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. రిప్రజంటేటివ్‌లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆశాజనకం. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
ధనస్సు : విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపువుతుంది. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం. రావలసిన ధనం ఆందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
మకరం : శ్రీవారు, శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. హామీలకు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ప్రముఖులతో సాన్నిహిత్యం పెంచుకుంటారు. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు ఆశాజనకం. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అధిక కృషి చేస్తారు. 
 
కుంభం : సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. దంపతుల మధ్య నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి ఆదరణ లభిస్తుంది. దైవ, సేవ, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండండి. 
 
మీనం : నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో పునరాలోచన చాలా అవసరం. స్త్రీలకు కొత్త పరిచయాలు వల్ల వ్యాపకాలు, కార్యక్రమాలు విస్తృతమవుతాయి. ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

15-03-2020 ఆదివారం మీ దినఫలాలు - ఆదిత్య హృదయం చదివితే సర్వదా...