Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14-12-2019 శనివారం రాశిఫలాలు (video)

Advertiesment
14-12-2019 శనివారం రాశిఫలాలు  (video)
, శనివారం, 14 డిశెంబరు 2019 (09:34 IST)
మేషం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పురోభివృద్ధి. దైవ, సాంఘిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు కోరుకున్న టెక్నికల్, మెడికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. ఖర్చులకు సరిపడు ఆదాయం సమకూర్చుకుంటారు. షేర్ మార్కెట్  రంగాల వారికి సామాన్యం. శుభవార్తలు వింటారు.
 
వృషభం : భాగస్వామిక ఒప్పందాలు, స్థిరాస్తి క్రయ విక్రయాలలో ప్రముఖుల సలహా పాటించటం మంచిది. కోర్టు వ్యవహారాలు ప్రగతిపథంలో నడుస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. పండ్లూ, పూలు, కూరగాయల వ్యాపారస్తులకు కలసివచ్చే కాలం.
 
మిథునం : ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి. ప్రేమికుల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు. సామూహిక కార్యక్రమాలలో పాల్గొంటారు. షామియానా, సప్లయ్ రంగాలలోని వారికి గణనీయమైన పురోభివృద్ధి. ఖర్చులు మీ రాబడికి తగినట్లుగానే ఉండగలవు. ఆలయాలను సందర్శిస్తారు.
 
కర్కాటకం : వృత్తి వ్యాపారుల ఊహించని చికాకులు, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకున్న పనులు ఆశించినంత త్వరగా పూర్తి కాకపోవడంతో నిరుత్సాహం చెందుతారు. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడాల్సి వస్తుంది. మీ యత్నాలకు సన్నిహితులు ప్రోత్సాహం, సహకారం అందిస్తారు.
 
సింహం : సైన్సు, గణిత రంగాలలోని వారికి గణనీయమైన పురోభివృద్ధి. క్రయ విక్రయ రంగాల వారికి నూతన ఉత్సాహం కానవస్తుంది. వాహనం విషయంలో సంతృప్తి కానరాదు. కాంట్రాక్టర్లకు ఒత్తిడి తప్పదు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. లిటిగేషన్ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఖర్చులు సామాన్యం.
 
కన్య : స్త్రీలకు ఆకస్మిక ధనప్రాప్తి, వస్తు లాభం వంటి శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ అవసరాలకు, మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. రాజకీయాల వారికి పార్టీపరంగానూ, అన్నివిధాలా గుర్తింపు లభిస్తుంది. ఇంటర్వ్యూలలో శ్రద్ధ వహించండి. ఫైనాన్స్, ఛిట్‌ఫండ్ రంగాలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
తుల : నూతన ఒప్పందాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు ఊహించని చికాకులు తలెత్తినా తెలివితో పరిష్కరించుకోగలుగుతారు. ధనం సమయానికి అందటంవల్ల సంతృప్తి కానవస్తుంది. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం.
 
వృశ్చికం : స్త్రీలకు వస్త్ర, వస్తులాభం లాంటి శుభ పరిణామాలు ఉంటాయి. నిరుద్యోగులు విజయం సాధిస్తారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. కళ, క్రీడా రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు.
 
ధనస్సు : గృహంలో మార్పులు, చేర్పులకు కొంతకాలం వేచియుండటం మంచిది. ప్రైవేటు సంస్థల్లోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఒత్తిడి, చికాకులు తప్పవు. రావలసిన ధనం చేతికి అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. మిత్రులను కలుసుకుంటారు.
 
మకరం : కందులు, ఎండుమిర్చి, స్టాకిస్టులు, వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది. మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం. చిన్న చిన్న విషయాలలో మానసిక ఆందోళనకు గురవక తప్పదు. ఆకస్మికంగా సన్నిహితులతో మార్పులు కానవస్తాయి. రవాణా రంగాలలోని వారికి మిశ్రమ ఫలితం కానవస్తుంది.
 
కుంభం : వస్త్ర, బంగారు, వెండి రంగాలలోని వారికి పురోభివృద్ధి. ట్రాన్స్‌ఫోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాలలోని వారికి పనివారితో సమస్యలు తప్పవు. దంపతుల మధ్య అవగాహన కుదరదు. వ్యాపారాభివృద్ధికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది.
 
మీనం : రచయితలకు, పత్రికా రంగంలోని వారికి కీర్తి, గౌరవాలు పెరుగుతాయి. వాహనం నడిపేటప్పుడు మెలకువ అవసరం. గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. మీ మిత్రుల కోసం, బంధువుల కోసం బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. స్పెక్యులేషన్ కలసిరాదు. ప్రేమానుబంధాలు బలపడతాయి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

13-12-2019 శుక్రవారం రాశిఫలాలు - వ్యాపారాల్లో పెరిగిన పోటీ... (video)