Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

04-08-2020 మంగళవారం రాశిఫలాలు - వేతనం తక్కువైనా వచ్చినా...

Advertiesment
04-08-2020 మంగళవారం రాశిఫలాలు - వేతనం తక్కువైనా వచ్చినా...
, మంగళవారం, 4 ఆగస్టు 2020 (05:00 IST)
మేషం : ఏదైనా అమ్మే ఆలోచన వాయిదా వేయడం మంచిది. నూతన వ్యక్తుల పరిచయాల వల్ల కొన్ని పనుల సానుకూలమవుతాయి. ప్రైవేటు సంస్థల్లో వారు రిప్రజెంటేటివ్‌లు, మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడగలవు. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. పెద్దల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. 
 
వృషభం : సినీరంగ ప్రరిశ్రమలో వారికి చికాకులు, ఒత్తిడి అధికమవుతుంది. ప్రభుత్వం మూలక ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల వల్ల అప్రమత్తత అవసరం. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. పూర్వ మిత్రుల కలయిక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. స్పెక్యులేషన్ కలిసిరాగలదు. 
 
మిథునం : ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో సమావేశాలలో వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయాలి. కొబ్బరి, పండ్ల, పూల, బేకేరీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. 
 
కర్కాటకం : విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. చిట్స్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. కుటుంబీకుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనివ్వగలవు. 
 
సింహం : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు నెమ్మదిగా తీరుతాయి. రావలసిన మొండిబాకీలు సైతం వసూలవుతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలయాలను సందర్శిస్తారు. శ్రీవారి, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. 
 
కన్య : లీజు, ఏజెన్సీ, నూతన కార్యక్రమాల్లో అనుకూలిస్తాయి. విద్య సంస్థలలో వారికి, ఉపాధ్యాయులకు అనుకూలమైనకాలం. సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. మీరు ఊహించని దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. 
 
తుల : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. స్త్రీలు నూతన వస్త్రాలు, విలువైన వస్తువులు, అమర్చుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లతీరు ఆందోళన కలిగిస్తుంది. వాతావరణంలోని మార్పు రైతులకు కొత్త ఉత్సాహం కలిగిస్తుంది. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులు పై అధికారులను తక్కువ అంచనా వేయడం వల్ల మాటపడక తప్పదు. వైద్య సలహా ఔషధ సేవనం తప్పదు. ఒకస్థిరాస్తి విక్రయించే ఆలోచన విరమించుకోవడం మంచిది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. వాదోపదావాలకు దిగకుండా లౌక్యంగా మీ వ్యవహారాలు చక్కబెట్టుకోవలసి ఉంటుంది. 
 
ధనస్సు : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. కుటుంబీకులతో ఎక్కువ సమయం గడపండి. విజయం మీ సొంతం అని గుర్తించండి. స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదాపడటం మంచిది. రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. కాంట్రాక్టర్లకు ఓర్పు, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. 
 
మకరం : నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రతత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. ప్రేమికులకు మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఎదురయ్యే ఎలాంటి హాని నుంచైనా మిమ్మల్ని, మీరు కాపాడుకునేందుకు తక్షణం సిద్ధంగా ఉండండి. మీరు కోరుకున్న రంగంలో విజయం సాధించాలి అంటే మిత్రుల సలహాను పాటించండి. 
 
మకరం : నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం. ప్రేమికులకు మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఎదురయ్యే ఎలాంటి హానినుంచైనా మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు తక్షణం సిద్ధంగా ఉందండి. మీరు కోరుకున్న రంగంలో విజయం సాధించాలి అంటే మిత్రుల సలహాను పాటించండి. 
 
కుంభం : మీ యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆకస్మికంగా ప్రయాణాల వల్ల ధనం అధికంగా వ్యయం చేస్తారు. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా కొనసాగుతాయి. అసలైన మీ లక్ష్యాలను చేసుకోవాలంటే పనిపై అంకితభావంతో పని చేయాల్సిఉంటుంది. దంపతుల మధ్య ఏకీభావం సాధ్యం కాదు.
 
మీనం : ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత తప్పదు. ఉద్యోగంలో అదనపు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. క్యాటరింగ్ పనివారలకు సామాన్యంగా ఉంటుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రావణ పౌర్ణమి.. హయగ్రీవ జయంతి.. యాలకుల మాల సమర్పిస్తే..?