Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

02-09-2019 సోమవారం దినఫలాలు.. ఆ రంగాల వారికి ఏకాగ్రత...

02-09-2019 సోమవారం దినఫలాలు.. ఆ రంగాల వారికి ఏకాగ్రత...
, సోమవారం, 2 సెప్టెంబరు 2019 (10:15 IST)
మేషం: రవాణా రంగాలలోని వారికి ఏకాగ్రత చాలా అవసరం. పెద్దల ఆరోగ్యములో జాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలు ద్విచక్ర వాహనం పై దూరప్రయాణాలు చేయడం క్షేమదాయకం కాదు. పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి.
 
వృషభం: పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. బంధువులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. రవాణా రంగాల వారికి ప్రయాణీకులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మిధునం: స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఏమరుపాటు, అశ్రద్ధ కూడదు. పండ్లు, పూలు, కొబ్బరి వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రచయితలకు, పత్రికా, ప్రైవేటు సంస్థల్లో వారికి ఆశించినంత పురోభివృద్ధి. స్థిరాస్తి అమ్మకం వాయిదా వేయటం మంచిది. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు.
 
కర్కాటకం: స్త్రీలు దైవ, పుణ్య కార్యాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. విద్యార్థులకు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం.
 
సింహం: స్త్రీలకు దైవ, పుణ్య, శుభ కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రేమికులకు నిదానం అవసరం. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. మీ సంతానం కోసం ధనం విపరీతంగా వ్యయం చేస్తారు.
 
కన్య: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం లభిస్తుంది. మీ యత్నాలకు బంధువులు సహకరిస్తారు. స్త్రీలకు అలంకరణలు, విలాసవస్తుల మీద మక్కువ పెరుగుతుంది. ఇతరులను అతిగా విశ్వసించటం వల్ల నష్టపోయే ప్రమాదముంది జాగ్రత్త వహించండి. నూతన వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలం. 
 
తుల: మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. వాహనం ఇచ్చి విషయంలో లౌక్యంగా వ్యవహారించండి. ఆప్తుల రాకతో మానసికంగా కుదుటపడతారు. స్త్రీలకు అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. ఏదైనా స్ధిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన మరి కొంత కాలం వాయిదా వేయటం మంచిది.
 
వృశ్చికం: మిత్ర బృందాల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి కొత్త కొత్త పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తారు. రిప్రజెంటివ్‌లకు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. ఏ విషయంలోను ఇతురులపై ఆధారపడక స్వయం కృషిపైనే ఆధారపడటం మంచిది.
 
ధనస్సు: మీ సంతానం వైఖరిలో మార్పు సంతోషపరుస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు.
 
మకరం: వాతారణంలో మార్పు వల్ల మీ పనులు అనుకున్నంత చురుకుగా సాగవు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షీతులౌతారు. రాజకీయనాయకులు సభ సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చటం వల్ల మాటపడక తప్పదు. ఒంటెత్తు పోకడ మంచిది కాదు గమనించండి.
 
కుంభం: మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. వాహనం ఇచ్చి విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఆలయాలను సందర్శిస్తారు. విదేశాలు వెళ్ళలనే మీ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యాలు దాచినందుకు కలహాలు తప్పవు. ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మీనం: రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. ఒక ఖర్చు నిమిత్తం తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగిస్తారు. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. బంధువుల ఆకస్మిక రాకతో గృహంలో సందడి కానవస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-09-2019- ఆదివారం మీ రాశి ఫలితాలు..