ఫిబ్రవరి 10న మీ రాశి ఫలాలు.. ఆదాయం అంతంత మాత్రమే
మేషం : విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. స్వతంత్ర్య నిర్ణయాలు తీసుకోవడం ద్వారా శుభం చేకూరుతుంది. తలపెట్టిన పనులు వాయిదా పడతాయి. ఖర్చులు ఆదాయానికి తగినట్లుగా ఉంటాయి. మీ ఉత్సాహాన
మేషం : విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. స్వతంత్ర్య నిర్ణయాలు తీసుకోవడం ద్వారా శుభం చేకూరుతుంది. తలపెట్టిన పనులు వాయిదా పడతాయి. ఖర్చులు ఆదాయానికి తగినట్లుగా ఉంటాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
వృషభం: పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. కనిపించకుండా పోయిన విలువైన పత్రాలు, రశీదులు తిరిగి లభిస్తాయి.
మిథునం: చేతివృత్తుల వారికి అవకాశం లభించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. గృహనిర్మాణం, ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. భాగస్వామికులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు.
కర్కాటకం: వృత్తి, వ్యాపారులకు సమస్యలు ఎదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు షాపింగ్ విషయాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. కుటుంబీకుల మధ్య అవగాహనలోపం ఏర్పడుతుంది.
సింహం: మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ఓర్పు, పట్టుదలతో అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆస్తి పంపకాల్లో సోదరుల మధ్య ఏకీభావం నెలకొంటుంది. దైవ, సేవా కార్యక్రమాలకు ఇతోధికంగా సహకరిస్తారు.
కన్య: ఆర్థికస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. స్త్రీలు అయిన వారి నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. కళలు, రాజకీయ, ప్రజాసంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. కొబ్బరి, పండ్ల, పూల, తినుబండారాల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది.
తుల: స్థిరాస్తుల అమ్మకానికై చేయు యత్నాలు వాయిదా పడటం మంచిది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. ఉద్యోగస్తుల బదిలీ యత్నాలకు కొంతమంది ఆటంకాలు కలిగిస్తారు. ఆత్మీయుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. మీడియా రంగాల వారికి పనిభారం, ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
వృశ్చికం: భాగస్వామిక చర్చలు ప్రశాంతంగా ముగుస్తాయి. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. ఏజెంట్లు, బ్రోకర్లు, క్యాటరింగ్ పనివారలకు సామాన్యంగా ఉంటుంది. స్త్రీలకు కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు.
ధనస్సు: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను తెచ్చుకోకండి. సోదరి, సోదరులతో పరస్పర అవగాహన లోపం తలెత్తవచ్చు. గతస్మృతులు జ్ఞప్తికి రాగలవు. స్త్రీల ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం.
మకరం ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. స్త్రీలకు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారితో సమన్వయం లోపిస్తుంది. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం బాగా శ్రమించాల్సి వుంటుంది.
కుంభం: ఉపాధ్యాయులకు యాజమాన్యం నుంచి సమస్యలు తలెత్తుతాయి. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు అధికమవుతాయి. విమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. స్త్రీలకు పనిభారం అధికం కావడంతో ఆరోగ్యపరమైన సమస్యలు వంటివి ఎదుర్కొంటారు.
మీనం: ధన వ్యయం విపరీతంగా ఉన్నా సార్థకత ఉంటుంది. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి.