Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భవిష్యత్తును సూచించే కాకి అరుపులు.... ఇంటిపై కాకి పదే పదే అరిస్తే...

మన పూర్వీకులు మనుషుల జీవితం - మరణం కాకితో ముడిపడినట్లు విశ్వసిస్తారు. చనిపోయిన మన పూర్వీకులే కాకి రూపంలో ఉంటారని కూడా నమ్మకం చాలామందిలో ఉంది. శ్రాద్ధ కర్మల సమయంలో కాకి పిండం తింటే చనిపోయిన వారి ఆత్మ సంతృప్తి పొందిందని కూడా చెబుతుంటారు. కాకులు మన భవిష

Advertiesment
భవిష్యత్తును సూచించే కాకి అరుపులు.... ఇంటిపై కాకి పదే పదే అరిస్తే...
, గురువారం, 19 జనవరి 2017 (23:07 IST)
మన పూర్వీకులు మనుషుల జీవితం - మరణం కాకితో ముడిపడినట్లు విశ్వసిస్తారు. చనిపోయిన మన పూర్వీకులే కాకి రూపంలో ఉంటారని కూడా నమ్మకం చాలామందిలో ఉంది. శ్రాద్ధ కర్మల సమయంలో కాకి పిండం తింటే చనిపోయిన వారి ఆత్మ సంతృప్తి పొందిందని కూడా చెబుతుంటారు. కాకులు మన భవిష్యత్తును అంచనా వేస్తాయని, ఇంట్లో కాకి అరిచినా - కొన్ని ప్రదేశాలపై వాలినా - కాకి తాకినా.. తన్నినా.. అది కొన్ని జరగబోయే అంశాలకు సూచికాలని కొన్ని నమ్మకాలు ఉన్నాయి. 
 
ఒకవేళ మీరు బయటకు వెళ్లేటప్పుడు కాకి వచ్చి,  గట్టిగా అరిచి,  వెళ్లిపోయిందంటే మీరు వెళ్తున్న పని లేదా మీ ప్రయాణం సక్సెస్ అవుతుందని సంకేతం. నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకి కూర్చుని ఉండటం ఎవరైతే చూస్తారో,  వాళ్లు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం. ఒకవేళ కాకి తన నోట్లో  రోటి లేదా బ్రెడ్ లేదా మాంసం ముక్క పట్టుకుని వెళ్లడం చూశారంటే, మీరు ఏదో శుభవార్త వినబోతున్నారని - మంచి జరగబోతోందని సంకేతం. 
 
ఒకవేళ మాంసం ముక్కను కాకి పట్టుకెళ్తుండగా అది ఎవరిపైన అయినా పడితే... అది అశుభానికి సంకేతం. కొన్ని గ్రంథాల ప్రకారం అది మరణానికి సంకేతం. ఒకవేళ ఎగురుతూ పోతున్న కాకి మగవాళ్లు లేదా ఆడవాళ్లను తాకడం లేదా కొట్టడం జరిగిందంటే, ఆ వ్యక్తి కాస్తా అనారోగ్యానికి గురవుతారని సంకేతం. గుంపులు గుంపులు కాకులు ఒక దగ్గరికి చేరి, అరుస్తూ ఉంటే... ఇంటి దగ్గర లేదా ఆఫీస్ దగ్గర లేదా ఒక ఊళ్లో అరిస్తే.. అది అశుభ వార్తకి సంకేతం. 
 
అలాగే ఆ ప్రాంతం ఓనర్ సమస్యల్లో పడతారని సంకేతం. ఒక వ్యక్తి తలపై కాకి వాలితే వాళ్లు అవమానాల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని సంకేతం. ఒకవేళ కాకి మహిళ తలపై లేదా ఆమెపై కూర్చుంటే.. ఆమె భర్త సమస్యల్లో పడతారని సూచిస్తుంది. ఒకవేళ సాయంత్రం పూట కాకి ఆగ్నేయం వైపు నుంచి రావడం చూశారంటే.. ద్రవ్యలాభం పొందుతారని సూచిస్తుంది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దైవానుగ్రహం ఎప్పుడు మీ మీద ఉంటుందో తెలుసా..!