Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్మ నుంచి విముక్తికి.. కాకికి జిలేబి, ఇడియప్పం, జంతికలు పెట్టాలట!

Advertiesment
crow

సెల్వి

, బుధవారం, 10 జులై 2024 (20:42 IST)
శనిదేవుడు న్యాయదేవత. పాపపుణ్యాలను బేరీజు వేసే దైవం. శనీశ్వర పూజతో ఈతిబాధల నుంచి గట్టెక్కవచ్చు. శనిని పూజించే వారికి శని మహర్దశకు సంబంధించి బాధలు తగ్గుతాయి. ఇంకా శనీశ్వరుడు కర్మలను పోగొట్టే దైవం అంటే కచ్చితంగా నమ్మాల్సిందే. 
Jilebi
 
కర్మలను పోగొట్టుకోవాలంటే రోజూ ఉదయాన్నే కాకికి ఆహారం పెట్టండి. మీరు పెట్టిన ఆహారాన్ని కాకి తింటే మీ కర్మఫలాలు తొలగిపోతాయని అంటారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలను ఎదుర్కొంటున్న వారైతే.. కర్మఫలాలను తొలగించుకోవాలనుకునే వారైతే రోజూ కాకికి మురుకులు, జిలేబీ, మిక్సర్, ఇడియప్పం వంటివి పెట్టవచ్చు. 
 
వీటిని కాకులు తినడం ద్వారా కర్మ తొలగిపోతుంది. అలాగే ప్రతి శనివారం నవగ్రహాలయానికి వెళ్లి మంచి నూనెతో దీపం వెలిగించి తొమ్మిదిసార్లు నవగ్రహ పూజ చేయడం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి. శని మన కర్మల నుంచి ఆత్మను విముక్తుడిని చేస్తాడు. 
 
అలాగే ప్రతి శనివారం తెల్లటి అన్నంలో నువ్వులు కలిపి ఉదయాన్నే కాకి కోసం ఉంచాలి. కాకికి పెట్టే ఆహారాన్ని స్నానం చేసి వండాలి. శనీశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థించాలంటే ఇంటి పూజ గదిలో నువ్వులతో దీపం వెలిగించి కాకి ఆహారం పెట్టడం చాలా మంచిది. 
Crow food
 
దీన్ని వారం రోజులు, శనివారాల్లో క్రమం తప్పకుండా చేయాలి. మీరు ఈ పరిహారాన్ని కొనసాగిస్తే మీ కష్టాలు తగ్గుతాయని మీరే అనుభూతి చెందుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10-07-2024 బుధవారం దినఫలాలు - సోదరులు మీతో అన్ని విషయాల్లోను ఏకీభవిస్తారు....