Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శనివారం నిష్ఠతో పఠిస్తే..?

విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శనివారం నిష్ఠతో పఠిస్తే..?
, శుక్రవారం, 26 జూన్ 2020 (19:04 IST)
విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శనివారం నిష్ఠతో పఠించేవారికి సకల సంపదలు చేకూరుతాయి. ఈతిబాధలు వుండవు. ఈ స్తోత్రపారాయణం ఇహపరాలను సాధించి పెడుతుంది. ఎవరుకానీ తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి దీన్ని పారాయణ చేస్తే వారు శాశ్వతంగా పవిత్రులు అవుతారు. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం శ్రీ వేదవ్యాసులు రచించారు. ఐదవ వేదం అయిన శ్రీ మహాభారతం లోనిది ఇది. 
 
దీనిలోని నూటన నలభై రెండు శ్లోకాలలోనూ మొదటి పదమూడు శ్లోకాలూ పీఠికా భాగం. తర్వాత నూట ఏడు శ్లోకాలలోనూ (పద్నాలుగో శ్లోకం నుంచి నూట ఇరవయ్యో శ్లోకం దాకా) శ్రీ మహావిష్ణుని స్వరూపాన్ని ఘనతను వర్ణించే వేయినామాలు ఉన్నాయి. నూట ఇరవై ఒకటో శ్లోకం నుంచి నూచ నలభై రెండో శ్లోకంతో సహా ఈ సహస్రనామస్తోత్ర పారాయణ ఫలం. 
 
భారతయుద్దంలో దెబ్బతిన్న భీష్ముడు శరతల్పం మీద వుండి కాను ప్రాణాలు వదలడం కోసం ఉత్తరాయన ప్రవేశాన్ని ఎదురుచూస్తూ ఉన్నాడు. యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు ఆ భీష్మపితామహుని నుంచి సకల ధర్మాలు వినినాడు. అయినా ఆతనికి తృప్తి కలుగలేదు. సకల ప్రాణులకూ పరమ గమ్యం ఐన ఏకైక దైవతం ఎవరు? అట్లే ఏ మహానుభావుని తత్త్వాన్ని ప్రతిపాదించే ఏ వాజ్ఞ్మయాన్ని జపిస్తే.. పైకి బిగ్గరగానో.. మెల్లగానో ఉచ్చరించినా మనస్సులోనే పఠించినా ముక్తి పొందగలుగుతారు అని భీష్మ పితామహుడిని ప్రశ్నించాడు. 
 
ఆ ప్రశ్నలకు సమాధానంగా భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిందే ఈ స్తోత్రం. కాబట్టి ఆపదలు తొలగాలన్నా శుభాలు కలగాలన్నా గ్రహభూత పిశాచాది బాధల నుంచి నివృత్తి కలుగుతుంది. ఈ స్తోత్ర పారాయణం ఇహలోకంలో సకల సుఖాలూ పరలోకంలో స్వర్గం నుంచి మోక్షం దాకా సకల శ్రేయస్సులూ కలిగిస్తుంది. ఈ సహస్ర నామ పారాయణంతో ఎల్ల శుభాలూ పొందుతారు. అనారోగ్యాలు తొలగిపోతాయి. మోక్షం సిద్ధిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలకు క్యూకట్టిన భక్తులు ... ఎందుకు?