Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

07-06-2017 మీ రాశి ఫలితాలు... ఇతరులకు వాహనం ఇవ్వడం...

మేషం : ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఊహించని విజయం మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. రవాణా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. తొందరపాటు నిర్ణయాలు తగవు. అవివాహితుల్

07-06-2017 మీ రాశి ఫలితాలు... ఇతరులకు వాహనం ఇవ్వడం...
, మంగళవారం, 6 జూన్ 2017 (22:04 IST)
మేషం : ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. దూరప్రయాణాలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఊహించని విజయం మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. రవాణా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. తొందరపాటు నిర్ణయాలు తగవు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది.
 
వృషభం : మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తుంది. పట్టు విడవకుండా మీ యత్నాలు సాగించాలి. ఆధ్యాత్మిక సేవా కార్యాక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. సంతృప్తి కానవస్తుంది. 
 
మిథునం : చిన్నపాటి అనారోగ్యానికి గురై చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు ఆర్జిస్తారు. ప్రత్తి, పొగాకు, స్టాకిస్టులకు చికాకులు తప్పవు. మీ అభిప్రాయాలు, మనోభావాలు సున్నితంగా వ్యక్తం చేయండి. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. 
 
కర్కాటకం : ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు తప్పవు. షాపుల మార్పుతో వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి పురోభివృద్ధి, గుర్తింపు, సదవకాశాలు లభిస్తాయి. సహోద్యోగుల సహాయంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి.
 
సింహం : ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. పాత రుణాలు తీరుస్తారు.
 
కన్య : ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. తోబుట్టువులతో వివాదాలు తలెత్తుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. తాపీ పనివారికి లాభదాయకంగా ఉంటుంది. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాట వేయండి. నిబద్ధతో పనిచేస్తే అంతా విజయమే. 
 
తుల : గృహ నిర్మాణానికి ప్లాను ఆమోదం, రుణాలు మంజూరవుతాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఖర్చులకు సరిపడా ధనం సమకూర్చడం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ వుండదు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. 
 
వృశ్చికం: ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. రాజకీయ రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. సినిమా, కళారంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు అనుకూలమైన సమయం. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
ధనుస్సు: శ్రీమతి, శ్రీవారి ఆరోగ్యము పట్ల శ్రద్ధ వహిస్తారు. స్త్రీలకు అధికశ్రమ దూరదేశాలు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. మీ ఇంటిని సరికొత్తగా మలచుకోవాలన్న మీ ఆశ నెరవేరదు. వసతి ఏర్పాట్ల విషయంలో ఒత్తిడి, చికాకులు ఎదురవుతాయి. 
 
మకరం : కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసివస్తుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు మిశ్రమ స్పందన ఎదురవుతుంది. 
 
కుంభం : స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. మెడికల్, ఇంజనీరింగ్, టెక్నికల్ విద్యార్థులు సామాన్య ఫలితాలే సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు నూతన బంధుత్వాలు ఏర్పడతాయి. లౌక్యంగా వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం.
 
మీనం : ఆధ్యాత్మిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. ప్రముఖులను కలుసుకుంటారు. విద్యా సంస్థలకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

06-06-2017 రాశి ఫలితాలు... పెద్ద మొత్తం ధనసహాయం క్షేమం కాదు...