Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శనివారం రాశి ఫలితాలు... ఇలా వున్నాయి...

మేషం : ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపందాల్చుతుంది. ఉద్యోగస్తుల శక్తిసామర్థ్

Advertiesment
Daily prediction
, శనివారం, 2 డిశెంబరు 2017 (06:04 IST)
మేషం : ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపందాల్చుతుంది. ఉద్యోగస్తుల శక్తిసామర్థ్యాలు అధికారులు గుర్తిస్తారు. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు.
 
వృషభం : కంది, మినుము, పెసర, నూనె వ్యాపారస్తులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. ప్రేమికుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. పత్రికా రంగంలోని వారికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి.
 
మిథునం : సినిమా, సంగీత, నృత్య కళాకారులకు సన్మానాలు వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు మంచిమంచి అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికమవుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి.
 
కర్కాటకం : కలప, ఐరన్, ఇటుక, ఇసుక, సిమెంట్ వ్యాపారులకు కలిసివస్తుంది. తలపెట్టిన పనులు అనుకున్నవిధంగా పూర్తి చేస్తారు. బంధువుల రాక వల్ల మీరు కొంత అసౌకర్యానికి లోనవుతారు. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిదికాదు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకున్నంత సంతృప్తినివ్వవు.
 
సింహం : నిరుద్యోగులు నిరుత్సాహంవీడి యత్నాలు సాగించిన సత్ఫలితాలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామి సలహాతో ఒక సమస్య నుంచి బైటపడతారు. మీతో స్నేహం నటిస్తూనే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారస్తులకు సమస్య తలెత్తినా లాభదాయకంగా ఉంటుంది.
 
కన్య : ఆర్థికంగా మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కిరాగలవు. తరచూ సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. గృహమునకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువుల రాకతో మీకు ఖర్చులు అధికమవుతాయి.
 
తుల : స్త్రీలు షాపింగ్‌ల కోసం ధనం ఖర్చు చేస్తారు. సంగీత, సాహిత్య కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచి శ్రమించండి. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ నేతలు ప్రముఖులతో చర్చలు జరుపుతారు. మిత్రులను కలుసుకుంటారు.
 
వృశ్చికం : స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మిత్రుల సలహాతో నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాలు వైపు కొనసాగుతాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానవస్తుంది. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. పాత రుణాలు తీర్చగలుగుతారు.
 
ధనస్సు : ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామిక వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు వాయిదాపడతాయి. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమన్వయ లోపం లభిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు.
 
మకరం : మీ ఆశయ సిద్ధికి అవరోధాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు. ఎప్పటికప్పడు వాయిదాపడుతూ వస్తున్న పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో పోటీతనం ఆందోళన కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. ఉపాధ్యాయులు ఎదుటివారితో మితంగా సంభాషించడం ఉత్తమం.
 
 
కుంభం : ప్రింటింగ్ రంగాల వారికి అచ్చుతప్పులు దొర్లడం వల్ల కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. హోటల్, తినుబండరాలు, పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఖర్చులు రాబడికి తగినట్లుగా ఉంటాయి. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఆలయాలను సందర్శిస్తారు.
 
మీనం : స్త్రీలకు బంధువుల నుంచి ఒత్తిడి, మొహమాటాలు ఎదురవుతాయి. ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. మీ విజ్ఞత, నిజాయితీలకు ప్రశంసలు లభిస్తాయి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆధార్ లింక్‌తో శ్రీవారి దర్శనానికి టైమ్‌స్లాట్‌ : ఈవో అనిల్