జ్యోతిషశాస్త్రంలో, బృహస్పతి గ్రహం ఐశ్వర్యం, వైభవం, సంపద, గౌరవానికి కారకంగా పరిగణించబడుతుంది. దేవగురు బృహస్పతి నవంబర్ 24న తన స్వంత రాశి అయిన మీనంలోకి రానున్నారు. దేవగురు బృహస్పతి మార్గి అంటే పరివర్తనం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతోంది. గజకేసరి యోగ ప్రభావం కొన్ని రాశులకు శుభప్రదం కానుంది.
గజకేసరి యోగం చాలా శుభప్రదమైంది. ఈ యోగంలో ధనలాభం చేకూరుతుంది. ఈ సమయంలో ప్రజలు ఆనందం, శ్రేయస్సు, సంపదను పొందుతారు. ఏ పని తలపెట్టినా విజయం వరిస్తుంది.
ఈ నేపథ్యంలో మేషరాశిలో 12వ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతోంది. గజకేసరి యోగ ప్రభావంతో ఆర్థిక ప్రభావం మెరుగుపడుతుంది. ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు.
వృషభం- దేవగురువు బృహస్పతి వృషభ రాశికి మంచి కార్యాలను జరిగేలా చూస్తాడు. ఉద్యోగోన్నతి ప్రాప్తిస్తుంది. వ్యాపారులకు లాభాలు చేకూరుతాయి.
కర్కాటక రాశి- దేవగురువు బృహస్పతి కర్కాటక రాశి యొక్క ఆరు- తొమ్మిదవ ఇంటికి అధిపతి. దేవగురువు బృహస్పతి పరివర్తనం ద్వారా కర్కాటక రాశికి పెట్టుబడికి అనుకూలం. ఈ కాలంలో మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది.
కన్య- కన్యారాశికి దేవగురువు బృహస్పతి నాల్గవ- ఏడవ ఇంటికి అధిపతి. బృహస్పతి పరివర్తనం ద్వారా ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా లాభం ఉంటుంది.
వృశ్చిక రాశిలోని గృహంలో గజకేసరి యోగం ఏర్పడుతోంది. సంతాన ప్రాప్తి చేకూరుతుంది. గజకేసరి యోగం తులారాశి వారికి ఎంతో ఆనందమయ జీవితం చేకూరుతుంది. అవివాహితులకు పెళ్లి ఖాయమవుతుంది.