Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2015లో వృశ్చిక రాశివారి ఫలితాలు ఇలా ఉన్నాయి....

Advertiesment
2015 Horoscope and Astrology
, బుధవారం, 31 డిశెంబరు 2014 (22:03 IST)
విశాఖ 4వ పాదము (తో)
అనూరాధా 1, 2, 3, 4 పాదములు (నా, నీ, నూ, నే)
జ్యేష్ఠ 1, 2, 3 పాదములు (నో, యా, యీ, యు)
ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1

 
వృశ్చిక రాశివారికి జూలై 14 వరకు భాగ్యము నందు బృహస్పతి, ఆ తుదుపరి అంతా రాజ్యము నందు, ఈ సంవత్సరం అంతా లాభము నందు రాహువు, పంచమము నందు కేతువు, ఈ సంవత్సరం అంతా జన్మము నందు శని సంచరిస్తారు. 
 
ఈ రాశివారి గోచారం పరీక్షించగా... 'న బుద్ధిర్థనలాభాయ న జాడ్యము సవృద్ధమే' అన్నట్లుగా తెలివితేటలు ఉన్నంతమాత్రమున కలిమి కలుగదు. జాడుడైనంత మాత్రమున లేమి కలుగదు అన్న వాస్తవాన్ని గుర్తిస్తారు. ఆరోగ్యంలో అనుకున్నంత సంతృప్తి కానరాదు. చిన్నచిన్న విషయాల్లో చికాకులు తలెత్తినా సమసిపోతాయి. ధనం ఏమాత్రం నిల్వచేయలేక పోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. మీ సృజనాత్మక శక్తికి, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తులోని వారికి, చిన్న తరహా పరిశ్రమల్లో వారికి అనుకూలమైన కాలం. ప్రత్తి, పొగాకు, మిర్చి రైతులకు ఇక్కట్లు తప్పవు. 
 
ఉద్యోగస్తులకు తోటివారితో అవగాహన, అధికారుల మన్ననలు పొందగలుగుతారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆశాజనకం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ప్రేమికుల మధ్య అపోహలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. విలువైన వస్తువుల కొనుగోలుకై చేయు యత్నాలు ఫలిస్తాయి. పోస్టల్ టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరగగలదు. స్టేషనరీ, ప్రింటింగ్, రంగాల్లో వారికి శ్రమ అధికం అవుతుంది. మీ వ్యక్తిగత విషయాల్లో సంతృప్తి కానరాదు. ఆత్మీయులలో ఒకరు దూరం అవుతారు. వైద్య రంగాల్లో వారికి నూతన ఉత్సాహం కానవస్తుంది. మీ కొత్త కొత్త ఆలోచనలు క్రియా రూపంలో పెట్టండి. లాయర్లకు ఆటంకాలు, ఆడిటర్లకు అభివృద్ధి కానవస్తుంది. సంగీత, కళారంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. 
 
స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ముఖ్యుల రాకపోకలు అధికమవుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు చేస్తారు. కోళ్ళ, మత్య్సు, గొఱ్ఱెల వ్యాపారస్తులకు చికాకు తప్పదు. ముఖ్యుల దృష్టిని ఆకర్షించగలుగుతారు. పారిశ్రామిక రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాగలదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రచయితలకు, పత్రికా రంగాల్లో వారికి నూతన ఉత్సాహం కానవస్తుంది. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో మెళకువ అవసరం. 
 
ఈ రాశివారికి ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల సంకల్పసిద్ధికి గణపతిని ఎర్రని పూలతో పూజించి, ఆవుపాలతో అభిషేకం చేయించిన సంకల్పసద్ధి, మనోసిద్ధి చేకూరుతుంది. ఈ రాశివారు 19 సార్లు నవగ్రహం ప్రదక్షిణం చేస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పఠించిన సర్వదా శుభం కలుగగలదు. 
 
II"ఓం రవి సుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నః శని ప్రచోదయాత్"II 
 
** విశాఖ నక్షత్రం వారు మొగలి మొక్కను, అనురాధ నక్షత్రం వారు పొగడ మొక్కను, జ్యేష్ఠ నక్షత్రం వారు కొబ్బరి మొక్కను, దేవలయాల్లో గానీ, విద్యా సంస్థల్లో గానీ, ఖాళీ ప్రదేశాల్లో గానీ నాటి దాని అభివృద్ధికి పాటుపడిన శుభం కలుగుతుంది. 
 
విశాఖ నక్షత్రం వారికి కనకపుష్యరాగం, అనూరాధ వారికి పుష్యనీలం, జ్యేష్ఠ వారికి గరుడపచ్చ ధరించిన శుభం కలుగుతుంది. ఈ రాశివారు ప్రతి శనివారం 9 సార్లు నవగ్రహ ప్రదక్షిణం చేసి ఎర్రని పూలతో శనిని పూజించిన కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. కార్తికేయుని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగిపోగలవు.

Share this Story:

Follow Webdunia telugu