Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2015 కర్కాటక రాశి వారి ఫలితాలు ఇలా ఉన్నాయి...

2015 కర్కాటక రాశి వారి ఫలితాలు ఇలా ఉన్నాయి...
, బుధవారం, 31 డిశెంబరు 2014 (21:12 IST)
పునర్వసు 4వ పాదము (హి)
పుష్యమి 1, 2, 3, 4 పాదములు (హు, హె, హో, డా)
అశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో)
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2 

 
కర్కాటక రాశివారికి జూలై 14వ తేదీ వరకు జన్మమము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా ద్వితీయము నందు, ఈ సంవత్సరం అంతా తృతీయము నందు రాహువు, బాగ్యము నందు కేతువు, ఈ సంవత్సరం అంతా పంచమము నందు శని సంచరిస్తారు. 
 
ఈ రాశివారి గోచారం పరీక్షించగా... 'కృషిమూలం మిదం ధనం' అన్నట్లుగా మీ కృషితో తెలివి తేటలతో అనుకున్నది తేలికగా పొందగలుగుతారు. ఒక్కోసారి అతి తెలివితేటలు అవలంభించడం వల్ల ఇబ్బందులకు లోనయ్యే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులు మార్పులు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు. పెద్దలు, ప్రముఖల నుండి సహాయ, సహకారాలు లభిస్తాయి. ఇంజనీరింగ్ రంగాల్లో వారికి అనుకోని ఇబ్బందులు తలెత్తవచ్చు. నిత్యావర వస్తు స్టాకిస్టులకు, ప్రభుత్వం నుంచి సమస్యలు తలెత్తగలవు. 
 
క్రయ, విక్రయ రంగాల్లో వారు ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వెళతారు. వాహనం అమర్చుకోవాలనే ఈ సంవత్సరం మే నెల తదుపరి గణనీయమైన పురోభివృద్ధి పొందుతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల్లో వారికి వ్యాపారస్తులకు, రిపేర్ సెక్షన్‌లో వారికి చేతినిండా పని ఉంటుంది. ఐరన్, సిమెంట్, ఇటుక స్టాకిస్టులకు అభివృద్ధి, ఇసుక వ్యాపారస్తులకు ఒత్తిడి, చికాకు తప్పవు. గృహంలో మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించవు. వ్యవసాయ రంగాల్లో వారు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వెళతారు. 
 
కోళ్ళ, మత్య్సు, పాడి, పరిశ్రమ రంగాల్లో వారికి వాతావరణంలో మార్పు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి, చికాకు తప్పదు. స్థిర, చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. మందులు, ఎరువులు, రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు ఆశాజనకం. భాగస్వాముల మధ్య అనుకోని విభేదాలు తలెత్తగలవు. నూతన అగ్రిమెంట్లకు శ్రీకారం చుట్టండి. వివాహం కానివారు రెండో భాగంలో శుభవార్తలు వింటారు. పత్తి, పొగాకు, నూనె, కంది, మినుము స్టాకిస్టులకు గణనీయమైన అభివృద్ధి కానవస్తుంది. 
 
చిన్నతరహా పరిశ్రమల్లో వారికి పనివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. కొంతమంది మాటతీరు మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. వాగ్ధానాలు చేసి సమస్యలకు గురికాకండి. స్త్రీలకు, బంధుమిత్రులతో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బీపీ, చక్కెర, వ్యాధి వంటి సమస్యల వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగగలవు. క్రీడారంగాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
ఈ రాశివారు పంచముఖ ఆంజనేయస్వామిని, స్థిరలక్ష్మీదేవిని తెల్లని పూలతో ఆరాధించడం వల్ల మనోవాంఛ నెరవేరగలదు. విద్యార్థులకు విద్యాభివృద్ధికి, స్థిరబుద్ధికి, సంకల్పం నెరవేరేందుకు సరస్వతీదేవిని పూజించడం వల్ల శుభం కలుగగలదు. 
 
** పునర్వసు నక్షత్రం వారు గన్నేరు చెట్టను, పుష్యమి నక్షత్రం పిప్పిలి చెట్టును, అశ్లేష నక్షత్రం వారు బొప్పాయి చెట్టును, దేవాలయాల్లో గానీ, విద్యా సంస్థల్లో గానీ, ఖాళీ ప్రదేశాల్లో గానీ నాటి వాటి పురోభివృద్ధికి తోడ్పడిన మీకు అభివృద్ధి కానవస్తుంది. 
 
పునర్వసు నక్షత్రం వారు కనకపుష్యం రాగం కానీ లేక వైక్రాంతమణిగానీ, పుష్యమి నక్షత్రం వారు జాతినీలం లేదా పుష్యనీలం, అశ్లేష నక్షత్రం వారు జాతిపచ్చ లేదా గరుడపచ్చ అనే రాయిని ధరించిన సర్వదా శుభం కలుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu