Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీరిది తప్పకుండా ప్రేమ వివాహమే..!

Advertiesment
ప్రేమ
WD
అనూరాధా నక్షత్రంలో పుట్టిన జాతకులు ప్రేమ వివాహం చేసుకుంటారని జ్యోతిష్కులు అంటున్నారు. ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులకు పెద్దల నిశ్చయించిన పెళ్లిళ్లు జరగడం తక్కువే. తల్లిమీద విశేషమైన అనురాగం కలిగి ఉండే వీరికి, తండ్రి పద్ధతులు నచ్చవు. సహోదరి, సహోదర వర్గం బాధ్యతలను నెత్తిన వేసుకుంటారు.

పెద్దల పట్ల గౌరవం భక్తి భావం కలిగి ఉండే వీరికి, పెద్దల ద్వారా స్వల్పంగానైనా ఆస్తులు వస్తాయి. గృహాలు, వాహనాలు, యంత్రాలకు సంబంధించిన వ్యవహారాలు వీరికి లాభిస్తాయి. సలహాలు చెప్పి మార్గాలు చూపి అనేక మంది పురోగతికి పునాది వేస్తారు. విద్య పట్ల ఆసక్తి, ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత పదవులను అలంకరిస్తారు.

కుటుంబ ప్రతిష్ట కోసం నిత్యం కష్టపడే వీరికి వైద్యరంగంలో రాణించే అవకాశాలు మెండు. ఎందరు ఆత్మీయులు ఉన్నా ఏకాంతంగా ఉండటంటే వీరికి చాలా ఇష్టం. అయినప్పటికీ ఒక బంధువర్గం నుంచి కీలక సమయంలో నమ్మక ద్రోహం ఎదురవుతుంది. దీంతో బంధువుల్లో ఒక వర్గంతో దీర్ఘకాల పోరాటం జరుగుతుంది.

ఇకపోతే.. సాహిత్య, కళారంగాల్లో ముందంజవేసే వీరికి సంతానం వల్ల పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. స్థిరమైన వృత్తి, వ్యాపారాల్లో నిలదొక్కుకునే ఈ జాతకులకు, భార్య అన్ని విధాలా సహకరిస్తుంది.

అనూరాధ శనిగ్రహ నక్షత్రం కావడంతో శనివారం పూట నువ్వులు దానం చేయడం మంచిది. అంతేగాకుండా అనూరాధ దేవగణ నక్షత్రం కావడం ఈ జాతకులు సూర్యోదయ కాలాన సూర్యుడిని ప్రార్థిస్తే దోషాలు, ఈతిబాధలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu