ఆగస్టు ఎనిమిదిన అత్యంత వేడుకగా ప్రారంభమైన బీజింగ్ ఒలింపిక్ పోటీలు ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నాయి. బీజింగ్ ఒలింపిక్ పోటీలు ప్రారంభమై 14 రోజుల పూర్తయ్యే సరికి 37 ప్రపంచ రికార్డులు, 77 ఒలింపిక్ రికార్డులు నమోదైనట్టు నిర్వాహక కమిటీ ప్రకటించింది.
దీంతోపాటు శుక్రవారం వరకు బీజింగ్ ఒలింపిక్స్‌లో క్రింది అంశాలు చోటు చేసుకున్నాయి. ఈ ఒలింపిక్‌లో శుక్రవారం నాటికి 80 దేశాలు పతకాల పట్టికలో స్థానం సంపాదించడం విశేషం. అలాగే శుక్రవారం వరకు 237 స్వర్ణ పతకాలు, 238 రజత పతకాలు, 273 కాంస్య పతకాలను విజేతలకు అందించారు.
దీంతోపాటు బీజింగ్ ఒలింపిక్ సందర్భంగా డోపింగ్ పరీక్షలను కూడా భారీగానే నిర్వహించినట్టు నిర్వాహక కమిటీ పేర్కొంది. బీజింగ్ ఒలింపిక్స్ సందర్భంగా 4620 డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3681 మూత్ర నమూనా పరీక్షలు నిర్వహించగా 939 రక్త నమూనా పరీక్షలు నిర్వహించినట్టు నిర్వాహక కమిటీ వివరించింది.