ఒలింపిక్ క్రీడల కవరేజ్ కోసం బీజింగ్‌కు చేరుకున్న విదేశీ పాత్రికేయులు తెచ్చుకున్న ప్రీ పెయిడ్ డేటా కార్డులు పనిచేయడం లేదు. దీంతో పాత్రికేయులు ఇబ్బందులకు గురయ్యారు. చైనాకు వచ్చిన పాత్రికేయులందరూ బీజింగ్ టెలికాం అథారిటీ జారీచేసిన కార్డులను కొనుగోలు చేయాలని మీడియా సెంటర్ వర్గాలు స్పష్టం చేశారు.
ఒలింపిక్స్ నిర్వహణా ఖర్చులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. క్రీడలు సందర్భంగా ఎవరికీ ఏదీ ఉచితంగా సేవలు అందించేది లేదని స్పష్టం చేశారు. క్రీడల నిర్వహణ కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సహకారం అంతంతమాత్రంగా ఉందని తెలియజేశారు.
విశ్వ క్రీడల నిర్వహణ కోసం చైనా నానా అడ్డదారులు తొక్కుతుందని అర్జెంటీనా మాజీ పాత్రికేయుడు జువాన్ టోరస్ వ్యాఖ్యానించాడు. బీజింగ్ ఒలింపిక్ క్రీడల నిర్వహణకు చైనాకు ఒక ప్రహసనంగా మారిందని ఆరోపించారు. విశ్వ క్రీడలను తిలకించటానికి భారీ సంఖ్యలో విదేశీయులు వస్తారని అంచనా వేసుకున్న చైనా ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది.