విశ్వ క్రీడలైన 2020 ఒలింపిక్స్‌లో బహుళ ప్రజాదరణ పొందుతున్న ట్వంటీ20 క్రికెట్‌కు స్థానం కల్పించాలని ఆస్ట్రేలియా మాజీ కీపర్, ఓపెనర్ ఆడం గిల్‌క్రిస్ట్ కోరారు. తద్వారా క్రికెట్‌కు కొత్త అందం సంతరించుకుంటుందని తెలిపారు. ఇటీవల కాలంలో ట్వంటీ20 మ్యాచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిందని వివరించారు.
ఆస్ట్రేలియా మెరుపు ఓపెనర్ ఆడం గిల్‌క్రిస్ట్ బీసీసీఐ నేతృత్వంలో ఆర్భాటంగా ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీల్లో హైదరాబాద్ డెక్కన్ ఛార్జర్స్ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు.
ఒలింపిక్స్‌లో భాగంగా 1900 సంవత్సరంలో జరిగిన పోటీల్లో క్రికెట్‌కు స్థానం కల్పించటం జరిగిందని గుర్తుచేశారు. ఆ తదుపరి కాలంలో క్రికెట్‌ను ఈ పోటీల నుంచి తొలగించారని వివరించారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో ప్రస్తుతం 10 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే శతాబ్ద కాలంలో క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ కృషి జరపాలని గిల్‌క్రిస్ట్ పిలుపునిచ్చారు.