బీజింగ్ ఒలింపిక్స్లో ఓటమి చెందినా ఓ అరబ్ యువరాణి మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆటలంటే మోజుపడే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యువరాణి షైకా మైతాబిన్ మహ్మద్ తైక్వాండో పోటీల్లో ఓడినా గల్ఫ్ దేశాల తరపున పోటీల్లో పాల్గొన్న మొదటి యువరాణిగా రికార్డు సాధించింది.
ఒలింపిక్స్ తైక్వాండో పోటలకు అర్హత సాధించడం ద్వారా బీజింగ్ పోటీల్లో పాల్గొన్న ఈ యువరాణి గల్ఫ్ దేశాల తరపున పతాకం పట్టుకుని నడిచిన తొలి మహిళగా ఖ్యాతి గాంచింది. అయితే తైక్వాండో పోటీల్లో మాత్రం ప్రత్యర్థి హ్యాంగ్ క్యాంగ్ చేతిలో 5-1 తేడాతో ఓడిపోవడం ద్వారా పతకం సాధించలేక పోయింది.
పోటీల అనంతరం ఆమె మాట్లాడుతూ బీజింగ్ ఒలింపిక్స్లో పాల్గొనాలన్న తన ఆశ నెరవేరినందుకు తాను చాలా సంతోషిస్తున్నానని పేర్కొంది.