విశ్వ క్రీడల సందర్భంగా పేరుకుపోయే వ్యర్ధాలను రీసైక్లింగ్ చేసే పనిని ముమ్మరం చేయాలని బీజింగ్ నిర్ణయించింది. బీజింగ్ నగరంలో 31 చోట్ల విశ్వ క్రీడలు జరుగుతాయి. ఈ ప్రాంతాల్లో పేరుకుపోయే వ్యర్ధాలను 50 శాతం మేర రీసైక్లింగ్ చేసేందుకు బీజింగ్ ప్రయత్నిస్తుంది.
పర్యావరణ వార్తా నెట్‌వర్క్ నివేదిక మేరకు బీజింగ్ నగరంలోని విశ్వ క్రీడా వేదికల వద్ద 14వేల టన్నుల వ్యర్ధాలను పేరుకుపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందులో పేపరు, ప్లాస్టిక్ బాటిల్స్, మెడికల్ సంబంధించినవి ఉన్నాయి.
ఒలింపిక్ క్రీడలకు గతంలో ఆతిథ్యమిచ్చిన నగరాలు అక్కడ పేరుకుపోయిన వ్యర్ధాలను చాలావరకూ రీసైక్లింగ్ చేసింది. ఇదే బాటలో చైనా కూడా నడవటానికి యత్నిస్తుంది. స్టేడియంల వద్ద పేరుకుపోయే ఆహార పదార్ధాల వ్యర్ధాలను నాలుగు గంటలలోపే క్లియర్ చేయాలని పారిశుధ్య సిబ్బందికి బీజింగ్ ఆదేశాలు జారీచేసింది. వ్యర్ధాలను సార్టింగ్ చేసేందుకు నాలుగు ప్రాసెసింగ్ సెంటర్లను బీజింగ్‌లో ఏర్పాటుచేశారు.