Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒలింపిక్ విలేజ్ నమూనా ఏర్పాటు

ఒలింపిక్ విలేజ్ నమూనా ఏర్పాటు
లండన్ , మంగళవారం, 5 ఆగస్టు 2008 (20:13 IST)
బీజింగ్ ఒలింపిక్స్ విలేజ్ నమూనాను కొంతమంది కళాకారులు రూపొందించి ప్రదర్శనకు ఉంచారు. దీనికి మినీ స్పోర్ట్స్ సిటీగా వారు పేరు పెట్టారు. దీనిని 3లక్షల ఇటుకలతో 4,500 మంది నిర్మించారు. ఈ నమూనా కొలత 8X3 మీటర్లుగా ఉంది. ఒలింపిక్ విలేజ్ నమూనాను హాంకాంగ్ లెగో యూజర్ గ్రూప్ నిర్మించింది. హాంకాంగ్‌లోని గ్రాండ్ సెంచురీ ప్లేస్‌లో ఈ నమూనాను ఆగస్టు 31వ తేదీ వరకు ప్రదర్శిస్తారు.

కళాకారులు రూపొందించిన ఈ నమూనాలో నేషనల్ స్టేడియం, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బీచ్ వాలీబాల్, ఫుట్‌బాల్, సెయిలింగ్, విండ్ సర్ఫింగ్ వంటి క్రీడల సమాచారం కూడా ఉంది. ఈ క్రీడల నమూనాలు ఇందులో ఉన్నాయి. బీజింగ్ ఒలింపిక్ క్రీడల ప్రారంభ వేడుకలు ఆగస్టు 8వ తేదీన జరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu