బీజింగ్ విశ్వ క్రీడల్లో భారత జట్టు షూటింగ్‌లో పతకం సాధిస్తుందని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దిగ్విజయ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. షూటింగ్ క్రీడలో భారత జట్టు తరపున తొమ్మిదిమంది సభ్యులు పాలుపంచుకుంటున్నారని వివరించారు. నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడుగా కూడా దిగ్విజయ్ సింగ్ వ్యవహరిస్తున్నారు.
భారత జట్టు తరపున ప్రపంచ ఛాంపియన్లు మానవ్‌జీత్ సింగ్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్‌లు బీజింగ్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్నారని వివరించారు. ఏథెన్స్ వేదికగా జరిగిన 2004 ఒలింపిక్ క్రీడల్లో రాథోర్ కాంస్య పతకాన్ని అందుకున్నాడని గుర్తుచేశారు. ఏథెన్స్ ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన ఏకైక భారతీయుడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ అని తెలిపారు.
చైనా తొలిసారి ఆతిథ్యమిస్తున్న బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత జట్టు పతకాలు సాధించగలదని అభిమానులు అంచనా వేసుకుంటున్నారు. ఇందులో టెన్నిస్, బాక్సింగ్, షూటింగ్‌లలో భారత క్రీడాకారులు పతకాలు సాధించగలరని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.