Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మన తర్వాత పౌరాణికాలు ఉంటాయా?

మన తర్వాత పౌరాణికాలు ఉంటాయా?

Raju

, సోమవారం, 15 సెప్టెంబరు 2008 (20:08 IST)
తెలుగులో పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట పోసిన నందమూరి తారక రామారావు పురాణాలకు సంబంధించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సాధికారత కలిగిన వ్యక్తులు ముగ్గురే ముగ్గురు అని ఘంటాపథంగా చెప్పేవారు. ఒకరు తెలుగు దర్శకేంద్రులలో అగ్రగణ్యులు కెవి రెడ్డి, కమలాకర కామేశ్వరరావు, ఎన్టీ రామారావు.
కనుమరుగైన పౌరాణిక త్రయం...
  ఈ త్రిమూర్తులు లేని తెలుగు పౌరాణికాలను ఊహించలేం. అలాగే.. ఈ త్రిమూర్తులు వెళ్లిపోయిన తర్వాత తెలుగులో పౌరాణికాలను అసలే ఊహించలేము. భరించలేము అంటే బాగుంటుందేమో...      


నాలుగు దశాబ్దాల క్రితం కృష్ణావతారం సినిమాకు కమలాకర ట్రిక్ షాట్లు తీస్తున్నారు. పౌరాణికాల్లో ట్రిక్ షాట్లు అంటే మాటలు కాదు. ఎంతో బరువైన ఆభరణాలు ధరించి గంటల తరబడి ఓపికగా నించోవాలి. ఆ రోజూ పరిస్థితి అదే. వయసులో పెద్దవారైనా తనతో పాటు ఓపికగా పనిచేస్తున్న కమలాకరను చూసి నందమూరి ఉద్వేగానికి గురయ్యారు.

ఆ ఉద్వేగంతోనే.. "మనిద్దరం పోయాక తెలుగులో అసలు పౌరాణికాలు ఉంటాయా' అని ప్రశ్నించారు. నిజంగా కూడా అలాగే జరిగింది. 1950, 60 దశకాల్లో తెలుగు చలనచిత్రాల్లో మాయాబజార్ వంటి పౌరాణిక సినిమాలతో సంచలనం సృష్టించిన కెవిరెడ్డి మొదట నిష్క్రమించారు.

తర్వాత చిన్నవాడైనా నందమూరి వెళ్లిపోయారు. తరువాత 1999 జూన్ 5న కమలాకర కామేశ్వరరావు నెల్లూరులో 88వ ఏట నిష్క్రమించారు. 90ల నాటికే తెలుగులో పౌరాణికాలు పూర్తిగా కనుమరుగయ్యాయి.

అమరపురిలో ఆ యిద్దరూ తమ గురువైన కెవి రెడ్డితో ఇప్పుడు తాము ఎంతగానో అభిమానించే పురాణాల గురించి చర్చించుకుంటూ ఉంటారనే వ్యాఖ్యల్లో ఎలాంటి సందేహమూ లేదు మరి. ఏదేమయినప్పటికీ ఆ ముగ్గురి కలయికలో తయారైన చిత్రాలు తెలుగు సినిమా ప్రేక్షకుడికి అజరామర కావ్యాలుగా మిగిలిపోయాయి.

ఈ త్రిమూర్తులు లేని తెలుగు పౌరాణికాలను ఊహించలేం. అలాగే.. ఈ త్రిమూర్తులు వెళ్లిపోయిన తర్వాత తెలుగులో పౌరాణికాలను అసలే ఊహించలేము. భరించలేము అంటే బాగుంటుందేమో...

Share this Story:

Follow Webdunia telugu