Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీబీ శ్రీనివాస్‌కు ఘంటసాల పురస్కారం

Advertiesment
వెండితెర నాటి వెండి చెన్నైలోని షర్మన్ సంస్థ ఆధ్వర్యం ఫిబ్రవరినెల 23వ తేదీ సాయంత్రం 630గంటలకు మనసున మనసై సంగీత విభావరి కలైమామణి పీబీ శ్రీనివాస్కు ఘంటసాల లైఫ్టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని అందజేయనున్నారు
చెన్నైలోని షర్మన్ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరినెల 23వ తేదీ సాయంత్రం 6.30గంటలకు స్థానిక కామరాజ ఆరంగంలో "మనసున మనసై" పేరిట సంగీత విభావరి కార్యక్రమంలో ప్రముఖ నేపథ్యగాయకుడు, ఘంటసాల సమకాలీకుడు, కలైమామణి పీ.బీ. శ్రీనివాస్‌కు ఘంటసాల లైఫ్‌టైం అచీవ్‌మెంట్ పురస్కారాన్ని అందజేయనున్నట్లు నిర్వాహకులు షరన్ ఇన్ కార్పోరేషన్ అధినేత డి.వి. రమణ తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా సమకూరే సొమ్మును బుద్ధిమాంద్యం కలిగిన చిన్నారులకు సేవ చేస్తున్న సంస్థ వి-ఎక్సెల్ ఎడ్యుకేషన్‌కు అందజేస్తామని ఆయన బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇంకా 15మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ గాయకులు పాల్గొంటారని, ఈ సంగీత విభావరి పూర్తిగా ఉచితమని, రసజ్ఞులందరూ హాజరు కావాలని ఆయన కోరారు. ముఖ్యంగా శివరాత్రి పర్వదినం సందర్బంగా నిర్వహిస్తున్న ఈ సంగీత విభావరికి ప్రజలు హాజరై ఘంటసాల గీత మాధ్యుర్యాన్ని ఆస్వాదించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ప్రముఖ నేపథ్యగాయకులు ఎస్. జానకి, అధ్యక్షులుగా ఎస్.పి.బాలసుబ్రమణ్యం హాజరవుతారని ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu