Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాటి వెండి కెరటాలు...

నాటి వెండి కెరటాలు...
, శుక్రవారం, 4 ఏప్రియల్ 2008 (20:35 IST)
మానవజాతి సాగించిన సాంకేతిక అన్వేషణలో సినిమా మాధ్యమానికి మహత్తర స్థానముందని తలపండిన విజ్ఞులు ఎప్పుడో ప్రకటించారు. ఇటీవలే 75 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలుగు సినిమా చరిత్ర గతంలోకి ఓసారి తొంగిచూస్తే నటనకు భాష్యం చెప్పిన మహానటులు, కడకంటి చూపులతో లక్షభావాలను పలికించి, వశీకరించిన మేటి నటీమణులు, సంగీత సాహిత్యాలకు, సినిమా నిర్మాణంలో తలమానికంగా నిలిచే కెమెరా విన్యాసాలకు, అబ్బురపర్చే దర్శకత్వ ప్రతిభకు మారుపేరుగా నిలిచే సాంకేతిక నిపుణులు ఎంతోమంది తెలుగు సినీ వినీలాకాశంలో స్వర్ణకాంతులను వెలయించి తమదైన గొప్ప వారసత్వాన్ని భవిష్యత్తరాలకు అందించి వెళ్లారు.

సినీచరిత్రకు సంబంధించిన ఆ పాత బంగారాన్ని, ఆ ఆపాత మధురాలను మళ్లీ ఓసారి మననం చేసుకోవడానికి, మన జాతి మేలి రత్నాలను తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికి 'నాటి వెండి కెరటాలు' పేరిట ఈ ఛానెల్‌ను పాఠకులకు అందిస్తున్నాం. మనదైన అలనాటి సినీ చరిత్రను మీ ముందుకు తీసుకు రావాలనే మా ఈ చిరు ప్రయత్నాన్ని అభిమానించి, ఆదరిస్తారని ఆశిస్తూ....
మీ వెబ్‌దునియా తెలుగు

Share this Story:

Follow Webdunia telugu