Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నర్తిస్తూనే తుదిశ్వాస విడిచిన గోపీనాథ్

నర్తిస్తూనే తుదిశ్వాస విడిచిన గోపీనాథ్

Raju

, బుధవారం, 25 జూన్ 2008 (17:46 IST)
WD
అమెరికాలోని మిచిగాన్‌లో జన్మించిన ఈషర్ ల్యూలా షేర్మన్ -రాగిణి దేవి- కి గోపీనాథ్ డ్యాన్స్ పార్టనర్‌గా ఉండేవారు. వీరిరువురు కలిసి ముంబైలో 1932లో తమ తొలి స్టేజి ప్రదర్శనను ఇచ్చారు. ఇది సాధించిన విజయంతో వీరు మరిన్ని ప్రదర్శనలను దేశవ్యాప్తంగా ఇవ్వగలిగారు. ప్రదర్శన, ప్రసంగాలతో కూడిన ఈ భారతీయ సాంప్రదాయ నృత్యం వీరిరువురి మేళవింపుతో బహుళ ప్రజాదరణకు నోచుకుంది.

"1930లలో యువ గోపీనాథ్ ప్రదర్శనను తిలకించిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ నృత్యకారుడికి బహువిధాలా ప్రశంసిస్తూ ఇలా రాశారు. గోపీనాథ్ నిజమైన కళాకారుడు. భారత్‌లో కానీ ప్రపంచంలో కాని గోపీనాథ్‌తో సరితూగగలవారు ఎక్కువమంది లేరని ఘంటాపధంగా చెప్పగలను.

నృత్యం భారతీయ ఉజ్వల సంపదగా వెలుగొందిన పురాస్మృతులను ఈయన తిరిగి నా మనోనేత్రం ముందుకు తీసుకువచ్చారు. మనమధ్య ఈయన ప్రదర్శన ఒక గొప్ప పాఠం స్థాయిలో ఉంది. తిరిగి ఇప్పుడు నృత్యం తనదైన రీతుల్లో మనముందుకు వచ్చింది. గోపీనాథ్ నాట్యశైలి మనలను సరైన దారిలో వెళ్లడానికి మనకు మార్గం చూపుతుంది. ఈ విషయంలో మనం ఇప్పటికీ అంథకారం నుంచి బయటకు రాలేకున్నాం."
నర్తనే ఆయన శ్వాస
  తాను ముందునుంచి కోరుకున్నట్లుగా స్టేజీమీద మేకప్‌తోనే కన్నుమూశారు. 1987 అక్టోబర్ 9న కేరళలోని ఎర్నాకులంలో ఉన్న ఫైన్ ఆర్ట్స్ హాల్‌లో, తన సుప్రసిద్ధ రామాయణం నృత్యరూపకంలో దశరథ మహారాజు పాత్రలో నర్తిస్తూనే గోపీనాథ్ పరమపదించారు      


మళయాళ చిత్ర పరిశ్రమ గురు గోపీనాథ్‌ను మళయాళీ చలనచిత్ర ప్రారంభ నటులలో ఒకరిగా గుర్తించింది. ప్రహ్లాద సినిమాలో హిరణ్యకశిపుడిగా గోపీనాథ్ నటించారు. ఇది మళయాళీ చలనచిత్ర చరిత్రలో ఆరవ చిత్రంగాను, సౌండ్ ట్రాక్ కలిగిన మూడవ చిత్రంగానూ పేరొందింది. జీవితనౌక సినిమాలో జీసస్ క్రైస్త్‌, భక్తకుచేల చిత్రంలో పూతనగాను ఆయన నటించారు.

పైగా, కథాకళిలోని 9 విభిన్న భావోద్వేగాలను చూపించగల అరుదైన నృత్య కళాకారులలో గోపీనాథ్ ఒకరు. ముఖం లోని సగభాగంలో వివిధ భావ వ్యక్తీకరణలను పలికించగల మేటి కళాకారుడీయన.

తాను ముందునుంచి కోరుకున్నట్లుగా స్టేజీమీద మేకప్‌తోనే కన్నుమూశారు. 1987 అక్టోబర్ 9న కేరళలోని ఎర్నాకులంలో ఉన్న ఫైన్ ఆర్ట్స్ హాల్‌లో, తన సుప్రసిద్ధ రామాయణం నృత్యరూపకంలో దశరథ మహారాజు పాత్రలో నర్తిస్తూనే గోపీనాథ్ పరమపదించారు. తన నాట్యజీవితంలో భాగంగా ప్రపంచంలో పలుదేశాలను ఆయన సందర్శించారు.


అమెరికా, రష్యా, శ్రీలంక వంటి పలుదేశాల్లో ఆయన నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. స్వతంత్ర భారత్ తరపున 1954లో రష్యా పర్యటించిన తొలి సాంస్కృతిక బృందంలో ఈయన సభ్యుడిగా ఉన్నారు. 1961లో ఫిన్లాండ్‌లోని హెల్సింకిలో జరిగిన 8వ ప్రపంచ యువజనోత్సవాల్లో సాంప్రదాయ నృత్యాలకు గాను న్యాయనిర్ణేతగా ఆయన ఆహ్వానం అందుకున్నారు.

నృత్యకారుడిగా ఆయన విశ్వరూపం దర్శించాలంటే తెలుగు, తమిళ చలన చిత్ర చరిత్రలో అజరామర కావ్యంగా పేరొందిన మాయాబజార్ సినిమాలో మోహినీ భస్మాసుర రూపకాన్ని చూసి తీరాలి.

తాను ఎవరి తలపై చేయి పెడితే వారు భస్మమయ్యేటట్లుగా శివుడి వరం పొందిన భస్మాసురుడు ఆ వర నిర్ధారణ కోసం శివుని నెత్తిపై చెయ్యి పెట్టబోయి తదనంతర పరిణామాలలో మోహిని రూపంలోని మహావిష్ణువు మాయలో పడి తన నెత్తిమీద తానే చేయిపెట్టుకుని భస్మమైపోయిన ఘటనను నభూతో నభవిష్యతి అన్న రీతిలో గోపీనాథ్ నర్తించి చూపారు.

అసురుడి మొరటుతనానికి, ధాష్టీకానికి రూపకం మొదటినుంచి చివరివరకూ ప్రాణప్రతిష్ట చేసిన గోపీనాథ్ ఆవిధంగా సాంప్రదాయ నృత్యాలను అభిమానుల్లోన కాక దక్షిణ భారత చలనచిత్ర ప్రేక్షకులు హృదయాల్లో అజరామరంగా నిలిచిపోయారంటే ఆశ్చర్య పోవలసిన పనిలేదు.

Share this Story:

Follow Webdunia telugu