సాంప్రదాయక రూపం విషయంలో ఏ మాత్రం రాజీపడని నాటి ప్రజానీకానికి తన కొత్త నృత్యరీతిని పరిచయం చేసి ఒప్పించడంలో, మెప్పించడంలో గురు గోపీనాథ్ అద్భుత సామర్థ్యం కనపర్చారు. రాజమందిరాలకు, దేవాలయ ప్రాంగణాలకు మాత్రమే పరిమితమై ఉన్న కథాకళిని విస్తృత ప్రజారాసుల చెంతకు చేర్చడంలో అనన్య సామాన్య కృషిని తలపెట్టిన క్రమంలో తనదైన సొంత శైలిని ఆవిష్కరించారు. దాదాపు 12 సంవత్సరాలపాటు ఏకధాటిగా నేర్చుకోవలసి ఉన్న కథాకళికి కొత్త సిలబస్ తయారు చేయడమే కాక శిక్షణా సమయాన్ని కూడా గణనీయంగా తగ్గించిన ఘనత గోపీనాథ్‌కే చెల్లింది. ఈ క్రమంలో అయన కథాకళి ప్రాచీన సంప్రదాయానికి, దాని సారానికి ఎలాంటి విఘాతం కల్పించలేదు. |
జీవిత చరమాంకంలో ఆయన రూపొందించిన రామాయణం నృత్యరూపకం బహుళ ప్రజాదరణను పొందింది. గోపీనాథ్ రామాయణ నృత్యరూపకం కేరళ వ్యాప్తంగా 1500 సార్లు ప్రదర్శించబడిందంటేనే దాని గొప్పతనం ఏమిటో సుబోధకమవుతుంది. |
|
|
రూపంలో సాంప్రదాయంగా కనిపిస్తూనే, సారంలో బహళ జనామోదాన్ని పొందే దిశగా కథాకళికి వెలుగు రేఖలద్దారు. ఒక్కమాటలో చెప్పాలంటే కథాకళి మరియు కేరళకు గోపీనాథ్ ప్రతిరూపంలా నిలిచారు. సాంప్రదాయ నృత్యాన్ని అర్థం చేసుకునే పాటి పాండిత్యం లేని సాధారణ భారతీయ ప్రజానీకం గోపీనాథ్ ఆవిష్కరణతో కథాకళిని ఆస్వాదిస్తూ పరవశించిపోయే స్థితికి చేరుకున్నారంటేనే గోపీనాథ్ కృషి ఏపాటిదో మనకు తెలుస్తుంది.
భారతీయ నాట్య రీతులు బైబిల్, ఆంగ్లికన్ లేదా సామాజిక వస్తువుతో ప్రయోగాలు చేయడానికి చాలా కాలం ముందే అంటే 1940, 50లలోనే గోపీనాథ్ విభిన్న నృత్యరీతులను రూపొందించారు. శ్రీ ఏసునాథ విజయం, దివ్య నాదం, సిస్టర్ నివేదిత, చండాల బిక్షుకి, కేరళ పిరవి (కేరళ రాష్ట్ర ఆవిర్భావంపై) వంటివి ఆయన ఎన్నుకున్న బ్యాలెట్లలో కనిపిస్తాయి.
అలాగే ఢిల్లీలోని రామ్ లీలా ప్రదర్శనలపై రూపొందిన నృత్యరూపకం ఆయన ప్రతిభకు సజీవ తార్కాణంలా నిలుస్తుంది. జీవిత చరమాంకంలో ఆయన రూపొందించిన రామాయణం నృత్యరూపకం బహుళ ప్రజాదరణను పొందింది. గోపీనాథ్ రామాయణ నృత్యరూపకం కేరళ వ్యాప్తంగా 1500 సార్లు ప్రదర్శించబడిందంటేనే దాని గొప్పతనం ఏమిటో సుబోధకమవుతుంది.
చారిత్రకంగా చూస్తే కథాకళి నాట్యరీతి, శిక్షణ కేవలం పురుషులకు మాత్రమే సంబంధించింది. అయితే కథాకళిని యువతులు కూడా ప్రదర్శించవచ్చని చూపించిన మొదటి వ్యక్తి గురు గోపీనాథ్.