Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటిపేరు "తాగుబోతు" అవుతుందని భయపడ్డా!: అక్కినేని

ఇంటిపేరు
WD
65 సంవత్సరాల సుదీర్ఘ సినీ చరిత్ర గల అక్కినేని నాగేశ్వరరావుకు తన నటజీవితంలో గుర్తుకు వచ్చిన సంఘటనల సమాహారంగా ఆ మధ్య మాటీవీలో ఓ కార్యక్రమం జరిగింది. వాటిని 25 భాగాలుగా వీసీడీల రూపంలో "గుర్తుకొస్తున్నాయి" పేరుతో విడుదల చేశారు. ప్రముఖ సీడీ కంపెనీ అయిన మోజర్‌బేర్ వీటిని విడుదల చేసింది.

గురువారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన కార్యక్రమంలో మోజర్‌బేర్ ఎంటర్‌టైన్‌మెంట్ సి.ఇ.ఓ హరీష్ దయాని, "మా"టీవీ సీఈవో శరత్ మరార్ సంయుక్తంగా వీటిని విడుదల చేశారు.

ఈ సందర్భంగా అక్కినేని మాట్లాడుతూ.. "నా దగ్గరకు ఓ జర్నలిస్టు వచ్చి జ్ఞాపకాల దొంతరలను తొలిచారు. ఏం గుర్తు పెట్టుకోవాలి? ఏం చెప్పాలి? అని ఆలోచించి కొన్ని చెప్పాల్సినవి, కొన్ని చెప్పకూడనివి ఉంటాయి కనుకు.. చెప్పాల్సినవి సమగ్రంగా చెప్పే ప్రయత్నం చేశాను. ఒకసారి ఇవన్నీ అవసరమా? అని నాకు అనిపించింది కూడా.

కానీ నాగేశ్వరరావుపై పిహెచ్‌డి చేసి ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశ్యాన్ని ఆ జర్నలిస్టు చెప్పడంతో ఇదేదో బాగుందని అంగీకరించాను. "దేవదాసు" తీసిన తర్వాత అన్నీ తాగుబోతు పాత్రలే ఉన్న కథలతో చాలామంది నా దగ్గరకు వచ్చారు. దీంతో నా ఇంటిపేరు 'అక్కినేని'కి బదులు 'తాగుబోతు'గా మారిపోతుందనే భయంకూడా ఏర్పడింది.

అలాంటి జ్ఞాపకాలు, ఆనందాలు, అవమానాలు, సంతోషాలు, దుఃఖాలు, మనోవేదన, అసహ్యం ఇలా ఎన్నో కోణాలను ఆవిష్కరించే భాగ్యం కలిగింది. 89 ఏళ్ళ వయస్సులో ఇంకా నా మెదడు షార్ప్‌గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను" అని నాగేశ్వరరావు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu