Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆధునిక బావామరదళ్లకు 60 ఏళ్లనాటి మల్లీశ్వరి బావామరదళ్ల స్వీట్ మెమరీస్ (వీడియో)

ఆధునిక బావామరదళ్లకు 60 ఏళ్లనాటి మల్లీశ్వరి బావామరదళ్ల స్వీట్ మెమరీస్ (వీడియో)
, సోమవారం, 12 డిశెంబరు 2011 (22:51 IST)
మొన్నీమధ్య ఆధునిక బావామరదళ్లును చూసి లోకం చాలాచాలా వేగంగా మారిపోతుందనిపించింది. సదరు మరదలు తన బిగుతైన డ్రెస్ కోడ్ గురించి టైట్ జీన్స్ ప్యాంట్ బావను కామెంట్ చేయమని అడుగుతోంది. ఇదీ మెయిన్ పాయింట్.. ఇక బావ ఏం చెప్పాడో.. మరదలు ఆ తర్వాత ఏమన్నదో చెప్పాలంటే మీరు వినలేరు.. నేను చెప్పలేననుకోండి.

ఐతే అలనాటి బావామరదళ్ల తీరు... ఒకవేళ వారి మధ్య ప్రేమ చిగురిస్తే హృదయాల్లో కలిగే భావాలు, దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు తీయనైన బాధను అనుభవిస్తూ తమ గోడును బావామరదళ్లు ప్రకృతితో పంచుకోవడాలు.. ఇవన్నీ నేటి "పిజ్జా"తరానికి పాతవాసలనే అయినప్పటికీ అటువంటి లోకంలో విహరించగలిగే నేటి టీనేజ్ జంటలకు కమ్మనైన తీయని పొదరిళ్లు.

సరిగ్గా 60 ఏళ్ల క్రితం విడుదలై అప్పట్లోనే 100 రోజులకు పైగా విజయవంతంగా ప్రదర్శించబడిన మల్లీశ్వరి చిత్రంలో బావామరదళ్లను చూస్తే సినిమాటిక్‌గా అనిపించదు. ఎందుకంటే దేవులపల్లివారి పాటలో భావం.. సాలూరివారి సంగీతంలో మాధుర్యం, భానుమతి - ఘంటసాలవార్ల గళాల్లోని కమ్మని తీయదనం, బావా(ఎన్టీఆర్) - మరదలు (భానుమతి) ప్రేమానుబంధం.. వెండితెరపై చూస్తున్నట్లు అనిపించదు. ఆ పాత్రలోకి మనల్ని లీనం చేసేట్లు ఉంటుంది. అందుకే ఆ చిత్రంలో ఏ పాట విన్నా ఇప్పటికీ పలు హృదయాలు అదోరకంగా స్పందిస్తాయి. మచ్చుకు ఓ వీడియో పాట మీకోసం...


సౌజన్యం: 55 పీలిడ్
మల్లీశ్వరి - 1951
సంగీతం - సాలూరి రాజేశ్వర రావు
రచన - దేవులపల్లి
పాడినవారు - భానుమతి, ఘంటసాల వెంకటేశ్వర రావు

Share this Story:

Follow Webdunia telugu