Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అలనాటి సినీతార సావిత్రి పేరిట అవార్డు: దాసరి

అలనాటి సినీతార సావిత్రి పేరిట అవార్డు: దాసరి
WD
అలనాటి సినీతార సావిత్రి పేరిట స్మారక అవార్డును ప్రతి ఏటా అందివ్వనున్నట్లు దర్శకరత్న డా. దాసరి నారాయణరావు ప్రకటించారు. సోమవారం తన 63వ పుట్టినరోజును పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో ఈ విషయాన్ని వెల్లడించారు. వి.ఆర్.మూర్తి, సోమరాజులు రచించిన "ఎ లెజండ్రీ ఆర్టిస్ట్ మహానటి సావిత్రి" పుస్తకాన్ని దాసరి ఆవిష్కరించి సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరికి అందజేశారు.

ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ.. సావిత్రిచే తమ్ముడు అని పిలిపించుకునే భాగ్యం తనకు కలిగిందన్నారు. సావిత్రి దర్శకత్వంలో "చిన్నారి పాపలు" చిత్రానికి తాను ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌గా పనిచేశానని దాసరి తెలిపారు. సావిత్రికి తెరమీద అద్భుతంగా నటిస్తుందని, కానీ జీవితంలో ఆమె నటించడం తెలియదని దాసరి అన్నారు.

అలా జీవితంలో సావిత్రి నటించి ఉంటే, కోటీశ్వరీ అయ్యేదని, ఆమె జీవితాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇంగ్లీషులో ఈ పుస్తకాన్ని రచించారని దాసరి వివరించారు. తెలుగు సినీ పరిశ్రమలో సినీతారగా ఓ వెలుగు వెలిగిన సావిత్రి ఎప్పటికీ మహానటీమణి అని దాసరి కొనియాడారు.

ఇదిలా ఉండగా.. దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా దాసరి జన్మదిన వేడుకల్లో రామానాయుడు, బాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.

భలే హుషారుగా కనిపించిన బాలకృష్
దాసరి పుట్టినరోజు వేడుకలో టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ భలే హుషారుగా కన్పించారు. ఉదయం 8.45 గంటలకే బాలకృష్ణ దాసరి నారాయణరావును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో పాటు సినిమాల్లో హీరోగా చేసే విన్యాసాలను బాలయ్య ఇక్కడ చేశారు. కారులోంచి దిగి, సెల్‌ఫోన్‌ను ఎగరేసి పట్టుకోవడం.. చూపరులను ఆకట్టుకుంది. వెళ్లేటప్పుడు అదే ఉత్సాహంతో మళ్ళీ ఫోన్‌ను ఎగరేయడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu