Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"ప్రేమనగర్‌"కు 38 ఏళ్ళు!

WD
తాజ్‌మహల్ సమాధికి చరిత్రలో గుర్తింపు ఉన్నట్లే తెలుగు చలనచిత్ర రంగంలో "ప్రేమనగర్"కు ఒక గుర్తింపు ఉంది.

సురేష్ ప్రొడక్షన్స్‌లో తన జీవితం తాడోపేడో తేల్చుకుందామని ప్రముఖ నిర్మాత రామానాయుడు నిర్మించిన చిత్రమిది. నవలలు సినిమాలుగా మారే కాలం అది. కోడూరి కౌసల్యాదేవి "విరచిత" నవల "ప్రేమనగర్".

ఆనాడు ఎందరో ఈ చిత్రాన్ని తీయాలని అనుకున్నా ఎందుకనో ధైర్యం చేయలేకపోయారు. కానీ ఈ నవలను చదివిన రామానాయుడు నాగేశ్వరరావుకు చెప్పడంతో ఆయన బాగుందని అనడంతో.. అందులోని కళ్యాణ్ పాత్రను నాగేశ్వరరావు చేత చేయించారు.

14.1.1971లో ప్రారంభించిన ఈ చిత్రం 24.8.1971లో విడుదలైంది. ఈ ఏడాది అంటే 24.9.2009కు 38 ఏళ్ళు పూర్తయ్యాయి. అప్పట్లో ఈ సినిమా షూటింగ్‌కు వాహిని స్టూడియో కిటకిటలాడిపోయింది.

అక్కినేని కొబ్బరికాయ కొట్టడం:
ఈ చిత్రంలో విశేషమేమిటంటే..? అక్కినేని నాగేశ్వరరావు కొబ్బరికాయ కొట్టడం. అక్కినేనికి రామానాయుడు మీద ఉండే అభిమానంతో వారి మాటను కాదనలేక దేవుడికి కొబ్బరికాయ కొట్టారు.

ఆ కొబ్బరికాయ సరిగ్గా రెండు భాగాలుగా పగలడంతో అక్కడి వారంతా ఈ సినిమా విజయం తథ్యమని జోస్యం చెప్పారట. దేవుడి పటాలకు కొబ్బరికాయ కొట్టడం అదే ప్రథమం. అదే ఆఖరని ఆయన ఈ మధ్య తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu