Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏకధాటిగా ఏడువందల వారాలుగా "డిడిఎల్‌జే"

ఏకధాటిగా ఏడువందల వారాలుగా

Gulzar Ghouse

20 అక్టోబర్ 1995వ సంవత్సరం తర్వాత చాలా హిట్, సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి, వెళ్ళాయి. కాని ముంబైలోని మరాఠా మందిర్ సినిమా హాలులో "దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే" సినిమా ఇప్పటివరకు నడుస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా విడుదలై 14 సంవత్సరాలు గడిచిపోయింది. అయినాకూడా ప్రజలు ఈ సినిమాను ఇంకా చూస్తుండటం విశేషం. చాలామంది వీక్షకులు కొన్ని డజన్లకు పైగా సినిమాను తిలకించారు.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, కాజోల్‌ను జంటగా ఆదిత్య చోపడా తన తొలి సినిమాను నిర్మించాడు. ఈ చిత్రం విడుదలైన ప్రతి చోటకూడా మంచి ఫలితాలను సాధించింది. మరాఠా మందిర్ సినిమాహాలులో మాత్రం ఈ చిత్రం 700 వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇంకా కొనసాగుతోంది.

భారతీయ సినిమా జగత్తులో ఇప్పటివరకు ఏ సినిమాకూడా ఇన్నివారాలపాటు ఆడలేదు. దీనికి ముందు బిగ్ బి నటించిన "షోలే" చిత్రం సంచలనం సృష్టించింది. అదికూడా ముంబైలోని మినర్వా ధియేటర్‌లో ఈ చిత్రం ఏకధాటిగా ఐదు సంవత్సరాలు(1975-1980) ఆడి ప్రజల మనస్సు దోచుకుని అప్పట్లో రికార్డులు సృష్టించింది. కాగా ప్రస్తుతం డిడిఎల్‌జే, షోలే రికార్డులను బద్దలుకొట్టిందని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu