ఉన్నది కాస్తా ఊడింది.. సర్వమంగళం పాడింది...
జూదం మనిషిని ఎంత వ్యసనపరుడ్ని చేస్తుందో... ఆ జూదంలో నెగ్గేందుకు ఓ వ్యక్తి ఎలాంటి పనులకు పూనుకుంటాడో... చివరికి అతని పరిస్థితి ఎలా తయారవుతుందో నాటి రచయిత కొసరాజు కళ్లకు కట్టినట్లు అందించారు. ఆ సాహిత్యానికి మాధవపెద్ది, పిఠాపురం, రాఘవులు జీవం పోశారు. నటనలో రమణారెడ్డి, రేలంగి ప్రాణంపోశారు. కులగోత్రాలు సినిమాలోని ఈ పాట... అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనేఅయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనేఅయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనేఅయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనేఉన్నది కాస్తా వూడింది సర్వమంగళం పాడిందిపెళ్లాం మెళ్లో నగలతో సహా తిరుక్షవరమై పోయిందిఅయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనేఅయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే ఆ మహా మహా నలమహారాజుకే తప్పలేదు భాయిఓటమి తప్పలేదు భాయిమరి నువు చెప్పలేదు భాయిఅది నా తప్పులేదు భాయితెలివి తక్కువగ చీట్లపేకలో దెబ్బతింటివోయిబాబూ నిబ్బరించవోయిఅయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనేఅయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనేనిలువుదోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేదిగోవింద.. గోవిందానిలువుదోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేదిచక్కెర పొంగలి చిక్కేదిఎలక్షన్లలలో ఖర్చు పెడితే ఎంఎల్ఏ దక్కేదిమనకు అంతటి లక్కేదిఅయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనేఅయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనేగెల్పూ ఓటమీ దైవాధీనం చెయ్యి తిరగవచ్చుమళ్లీ ఆడి గెల్వవచ్చుఇంకా పెట్టుబడెవడిచ్చుఇల్లు కుదువ చేర్చవచ్చుఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చుపోతే.. అనుభవమ్ము వచ్చుచివరకు జోలె కట్టవచ్చుఅయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనేఅయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే