Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒబామా కొలువులో భారత సంతతి మహిళ

ఒబామా కొలువులో భారత సంతతి మహిళ
, గురువారం, 6 నవంబరు 2008 (22:57 IST)
అమెరికాలో జన్మించిన భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎంపికైన బారక్ ఒబామాకు సలహాలు అందించే బృదంలో సదరు మహిళ స్థానం దక్కించుకుంది.

భారత్, అమెరికా సంతతికి చెందిన సోనాల్ షా అనే నలభై ఏళ్ల యువతి ఒబామా కొలువులోని సలహా సంఘం సభ్యురాలిగా నియమితురాలైంది. సోనాల్ స్థానం దక్కించుకున్న సలహా సంఘం ఒబామాకు పాలనా పరమైన వ్యవహారాల్లో తోడ్పాటును అందిస్తుంది. ఇంత గొప్ప అర్హత సంపాధించిన సంఘానికి సోనాల్ సలహాలు, సూచనలు అందించనుండడం విశేషం.

గుజరాత్‌కు చెందిన భారతీయునికి జన్మించిన సోనాల్ ఆర్థిక రంగంలో నిపుణురాలు కావడం విశేషం. ఈ రంగంలో సోనాల్‌కు విశేషమైన ప్రతిభకు గుర్తుగా సలహా సంఘం సభ్యురాలి హోదా దక్కినట్టు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu