Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తాంత్రిక శృంగారంపై హీథర్ వ్యాఖ్యలు

ఎన్నారై హిందువుల ఆగ్రహం...!!

Advertiesment
ఎన్ఆర్ఐ
ప్రముఖ హాలీవుడ్ నటి హీథర్ గ్రహమ్ తాంత్రిక శృంగారంపై చేసిన వ్యాఖ్యలపై, అమెరికాలోని హిందువులు మండిపడుతున్నారు. ఈ ప్రక్రియను కేవలం శృంగార కోణంలోంచే చూస్తున్న సదరు నటీమణి, తమ మతాచారాలను తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యానిస్తున్నారని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై నెవడాలోని భారత హిందూ పూజారి రాజన్ జెడ్ మాట్లాడుతూ... హాలీవుడ్ నటులు హిందూయిజాన్ని ఆచరించినట్లయితే వారిని సాదరంగా స్వాగతిస్తామన్నారు. అయితే హిందూ పరిభాష, మౌలిక భావనల గురించి ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడితే మాత్రం సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

తంత్రమనేది చైతన్య మార్గం ద్వారా స్వయం క్రమశిక్షణకు దోహదం చేస్తుందని, అలాంటి తాంత్రిక విద్య గురించి ఎలాబడితే అలా మాట్లాడితే ఊరుకోమని రాజన్ తీవ్రంగా మండిపడ్డారు. హిందూమతం అతి పురాతనమైనదేగాకుండా, ప్రపంచంలోనే అది మూడో అతిపెద్ద మతమని అన్నారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన హిందూమతాన్ని ప్రపంచంలోని బిలియన్ మంది ఆచరిస్తున్నారు. ఘనమైన తాత్విక సంపదను కలిగి ఉన్న హిందూమతం గురించి తేలికగా మాట్లాడటం భావ్యం కాదని రాజన్ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే... తాంత్రిక శృంగారం ద్వారా ఒకేసారి అనేక పనులు చేయవచ్చునని, ఈ ప్రక్రియ ద్వారా శృంగారంలో మంచి అనుభూతి లభిస్తుందంటూ ఒక ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో హీథర్ గ్రహమ్ వ్యాఖ్యానించారు. దీంతో హీథర్ వ్యాఖ్యాలపై ఆగ్రహించిన హిందువులు, ఎన్నారైలు... తమ మతంపై ఎలాంటి అవగాహనా లేకుండా అనవసరంగా నోరు పారేసుకుంటే, తగిన గుణపాఠం నేర్పుతామన్నారు.

Share this Story:

Follow Webdunia telugu