Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏ. పి రాజధాని “అమరావతి” అభివృద్ధిలో భాగస్వాములమవుతాం... గుంటూరు ఎన్నారై

డిసెంబరు 4, 2016 ఆదివారం సాయంత్రం 4 గంటలకు అమెరికాలోని డల్లాస్ నగరం దగ్గర ప్లానోలో గల తబలా ఇండియన్ రెస్టారెంట్లో గుంటూరు ఎన్నారై అసోసియేషన్ ఆధ్వర్యంలో "గుంటూరు అభివృద్ధి - ఎన్నారైల పాత్ర" అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా గ

ఏ. పి రాజధాని “అమరావతి” అభివృద్ధిలో భాగస్వాములమవుతాం... గుంటూరు ఎన్నారై
, సోమవారం, 5 డిశెంబరు 2016 (21:04 IST)
డిసెంబరు 4, 2016 ఆదివారం సాయంత్రం 4 గంటలకు అమెరికాలోని డల్లాస్ నగరం దగ్గర ప్లానోలో గల తబలా ఇండియన్ రెస్టారెంట్లో గుంటూరు ఎన్నారై అసోసియేషన్ ఆధ్వర్యంలో "గుంటూరు అభివృద్ధి - ఎన్నారైల పాత్ర" అనే అంశంపై  సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా గుంటూరు ఎన్నారైలు  జ్యోతి ప్రజ్వలన చేసి, గుంటూరుఎన్నారై వెబ్‌సైట్ gunturnri.org మరియు ఫేస్‌బుక్ పేజీని లాంచ్ చేసారు.
 
ఈ సందర్భంగా పలువురు గుంటూరు ఎన్నారైలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గుంటూరు దగ్గర అమరావతి లో  నిర్మించడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. రాజధాని అభివృద్ధిలో భాగస్వామ్యులవుతామన్నారు. గుంటూరు ఎన్నారై అసోసియేషన్ అమెరికాకే పరిమితం చేయకుండా ప్రపంచ వ్యాప్తంగా వున్న గుంటూరు వారందరిని కలిపేందుకు వేదికగా చేస్తామన్నారు. గుంటూరుకి చెందిన పేద విద్యార్థులకు ప్రోత్సాహకాలు, కెరీర్ గైడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ మరియు పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాసులు నిర్వహిస్తామన్నారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు కొమ్మినేని, చల్లా కొండ్రగుంట, శ్రీనివాస్ బవిరెడ్డి, అజయ్ గోవాడ, రాజ్ పల్లపోతు, లక్ష్మి యలవర్తి, రాజేష్ యడ్లపాటి, అనిల్ చాగంటి, నవీన్ సాంబ, చిరంజీవి కనగాయాల, మహేష్ గోగినేని, వెంకట్ యలవర్తి, కృష్ణ దండమూడి, శ్రీనివాస్ యలవర్తి, రవి కోటపాటి, రవి వెలివేటి, , నాగ మర్రి, సతీష్ మర్రి, ధరణి దొప్పలపూడి, సాయిచంద్ రాయపాటి, నాగార్జున యలవర్తి , హేమంత్ కోగంటి, సిద్ధార్థ్ యలవర్తి ,జగదీశ్ మోరంపూడి, పూర్ణ యలవర్తి, విజయ భార్గవ్ మందపాటి తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓట్స్‌లో దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకుంటే? ఆలివ్‌ నూనెతో గోబీ ఆకుల చిప్స్‌ చేస్తే?