ఇంగ్లాండులోని మిడ్‌ల్యాండ్స్, రుగ్బిలలో తొలిసారిగా యూకె తెలుగు హిందూ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు అంశాలపైన చర్చలు, అనేకమైన యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. తెలుగు హిందువుల కోసమే తొలిసారిగా దీనిని నిర్వహించడం జరిగింది.
యూకె వ్యాప్తంగా వున్న తెలుగు హిందువులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. స్వామి పరిపూర్ణానంద, శ్యాంజీ(క్షత్రియ ప్రచారక్-ఆంధ్ర, తెలంగాణ మరియు కర్నాటక) తమ యొక్క సందేశాలను ఇచ్చారు. అలాగే శ్రీ ధీరజ్ షాజీ, శ్రీ చంద్రకాంత్, డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ విదుల కూడా పాల్గొని తమ సందేశాలను ఇచ్చారు.
బ్రిటన్‌లో పెరుగుతున్న తెలుగు హిందూ పిల్లలు, యూకేలో సవాళ్లు ఎదుర్కొంటున్న హిందూ టీనేజర్స్, తెలంగాణ-ఆంధ్రల్లో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర విషయాలపై కూలంకషంగా చర్చించారు. ఆ తర్వాత వినోదాన్ని పంచే క్రీడలను నిర్వహించారు.