Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాన్సులేట్ జనరల్ వెబ్ఎక్స్ మీటింగ్‌లో పాల్గొన్న నాట్స్: ఇమ్మిగ్రేషన్‌తో పలు అంశాలపై అవగాహన

కాన్సులేట్ జనరల్ వెబ్ఎక్స్ మీటింగ్‌లో పాల్గొన్న నాట్స్: ఇమ్మిగ్రేషన్‌తో పలు అంశాలపై అవగాహన
, గురువారం, 18 మార్చి 2021 (21:10 IST)
టెంపాబే: అమెరికాలోని టెంపాబేలో భారతీయుల పౌరసత్వంతో పాటు వివిధ ప్రభుత్వ విధానాల్లో మార్పులు-చేర్పులు, విద్యార్ధులకు మార్గనిర్ధేశికత్వం లాంటి పలు అంశాలపై అట్లాంటా కాన్సులేట్ జనరల్ వెబ్ ఎక్స్ మీటింగ్ నిర్వహించింది. అట్లాంటా కాన్సులేట్ జనరల్ డాక్టర్ స్వాతీ కులకర్ణితో పాటు కాన్సులేట్ మార్కెటింగ్ అసిస్టెంట్ ప్రసాద్ వాన్‌పాల్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ మినీ నాయర్ ఈ వెబ్ ఎక్స్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
 
దోస్త్ అనే చాట్ బాక్స్ మీకు స్నేహితుడిలా సేవలు అందిస్తుందని.. మీకు ఉన్న సందేహాలను కూడా నివృత్తి చేస్తుందని  అట్లాంటా కాన్సులేట్ జనరల్ డాక్టర్ స్వాతీ ఈ మీటింగ్‌లో తెలిపారు. కోవిడ్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, సంస్కరణలు, వీసా విధానాలు, విద్యా విధానాలు ఇలా ఎన్నో విషయాలపై ఈ సదస్సులో అవగాహన కల్పించడం జరిగింది.
 
అమెరికాలోని భారతీయ సంఘాలు సాటి ప్రవాస భారతీయులకు సేవలందించడంలో చూపిస్తున్న ఉత్సాహాన్ని డాక్టర్ స్వాతీ ప్రశంసించారు. సాటి భారతీయుల సమస్యల పరిష్కారంలో భారతీయ సంఘాలు ముందుంటున్నాయని ఇది అభినందించదగ్గ విషయం అని చెప్పారు. ఎంతో ఉపయుక్తమైన ఈ కార్యక్రమంలో నాట్స్ బృందం పాలు పంచుకుంది.
 
నాట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని, వైస్ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీహరి మందాడి, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ (సేవలు) బాపు నూతి, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ (ప్రోగ్రామ్స్) వంశీకృష్ణ వెనిగళ్ల, ట్రెజరర్ మదన్ పాములపాటి, రాజేశ్ కాండ్రు సౌత్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపాబే సమన్వయకర్త ప్రసాద్ ఆరికట్ల, నాట్స్ లాస్ ఏంజిల్స్ విభాగం సమన్వయకర్త శ్రీనివాస్ చిలుకూరి తదితరులు ఈ పాల్గొన్నారు.
 
నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నేలు నాట్స్ టెంపాబే విభాగానికి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నందుకు టెంపాబే చాప్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రీన్ టీ రోజూ తాగితే.. పొట్ట ఫ్లాట్ అవ‌డం ఖాయం.. తెలుసా..?