Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

TANA Women’s ఫోరమ్ కమిటీతో ఇంటర్వ్యూ

TANA Women’s ఫోరమ్ కమిటీతో ఇంటర్వ్యూ
, గురువారం, 21 మే 2015 (20:40 IST)
జూలై నెలలో 2-4 తేదీల్లో డిట్రాయిట్‌లో జరుగనున్ను 20వ TANA మహాసభలను పురస్కరించుకుని అమెరికా TANA women’s forum ఏర్పాటు చేస్తోంది. ఈ కమిటీకి Dr. పద్మజ నందిగామ చైర్‌పర్సన్‌గా, ఉష అరి మరియు ఎండ్లూరి కో-చైర్‌పర్సన్స్‌గా వ్యవహరిస్తున్నారు. వీరిని ఈ కమిటితో ముఖాముఖీ మరియు కమిటీ విధివిధానాలపై సంప్రదించిన వివరాలు.
 
ప్రశ్న-అమెరికాలో చాలా women’s ఫోరంలు ఉన్నాయి. వాటికీ TANA women’s ఫోరంకి భేదం ఏమైనా ఉందా?
అమెరికాలో ఉన్న women’s ఫోరంలకి TANA women’s ఫోరమ్‌లకి తేడా ఏమిటంటే ఈ ఫోరంలో తెలుగువారి ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుంది. మా ఫోరంలో తెలుగు మహిళకు విజయాలు, సమర్ధత, ఒడిదుడుకుల గురించి చర్చిస్తాము.
 
ప్రశ్న- మీ టీం గురించి, మీ సభ్యుల గురించి కాస్త వివరంగా చెప్తారా? 
ఈ టీంకి Dr. పద్మజ నందిగామ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈమె Wayne State Universityలో సైకాలజీ ప్రొఫెసర్‌గా చేస్తూ, లైఫ్ కోచ్‌లో స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. Dr. సుధా రుద్రరాజు గారు, హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టంలో పిల్లల వైద్యనిపుణులుగా పనిచేస్తున్నారు. శ్రీమతి దుర్గ బోయపాటి గారు ఈ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తూ కన్స్యూమర్ కోర్ట్ మెంబెర్‌గా ఉన్నారు. ఈమె కడపలో విజయ ఫౌండేషన్ ట్రస్ట్ స్థాపించారు. అలాగే శ్రీమతి కల్పన ఎండ్లూరి గారు IT మేనేజర్‌గా పనిచేస్తూ ప్రముఖ NPOకి పనిచేస్తున్నారు. అలాగే జ్యోతి చావాగారు ఈ కమిటీలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.
 
ప్రశ్న- ఈ సంవత్సరంలో జూలై నెలలో TANA డిట్రాయిట్‌లో జరుగుతోంది కదా? ఈ కార్యక్రమాల్లో women’ఫోరంని ఉత్తేజపరచడానికి, స్త్రీల హక్కులను పటిష్టపరచడానికి, స్త్రీలను చైతన్యం కలగచేయడానికి ఎలాంటి ప్రముఖులను, వ్యక్తులను ఆహ్వానిస్తున్నారు? 
 
TANA Women’sలో వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలను ఆహ్వానిస్తున్నాం. మహిళలు ఎదుర్కొనే సాధకబాధకాలు గురించి మా వేదిక మీదకు విచ్చేసిన అతిధులు వారివారి అభిప్రాయాలు అనుభవాలను మాతో పాలుపంచుకుంటారు. జూలై 3వ తేది శుక్రవారం మా బిజినెస్ ప్యానెల్‌లో మమత చామర్తి గారు (CIO and VP TRW Information), రమాదేవి కన్నెగంటి(President of Association of Lady Entrepreneurs if Andhra Pradesh) , పద్మజ ప్రభాకర్ ( Secretary of Association of Lady Entrepreneurs if Andhra Pradesh), Dr. లక్ష్మి సలీం ( Plastic Surgeon, Founder Salaja Hospitals, India) పొలిటికల్ ప్యానెల్‌లో అరుణ మిల్లర్ తదితరులు పాల్గొంటారు.
 
జూలై 4న సోషల్ ప్యానెల్లో మైఫ్ నుంచి కొంతమంది సభ్యులు వలస వచ్చిన మహిళల సాదకబాధకాలు గురించి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంలో అమెరికాలలో ఉన్న భారత మహిళలు ఎదుర్కునే సమస్యలు వాటి సహాయ కార్యక్రమాలగురించి చర్చిస్తారు. అలాగే ఆ రోజున శ్రీమతి అపర్ణ మల్లాదిగారు (Director of Anushree Experiments) చలనచిత్ర రంగానికి సంబంధించి ఒక డాక్యుమెంటరీని సమర్పిస్తారు.
 
చివరగా 2015 జూలై 2 నుండి 4 వరకు డిట్రాయిట్‌లో జరిగే TANA ఏ విధమైన ప్రాముఖ్యతని సంతరించుకోనుంది? 
తానా 20 వ మహాసభలు విజయవంతంగా జరగడానికి, వివిధ కమిటీల వారు, వాలంటీర్లు, కోర్ కమిటీ సభ్యులు, తానా కార్యవర్గం, తానా అధ్యక్షులు నన్నపనేని మోహన్, మహాసభల కన్వీనర్ నాదెండ్ల గంగాధర్ గారి అధ్వర్యంలో సభలను జయప్రదం చేయడానికి నిర్విరామంగా కృషిచేస్తున్నారు. చేస్తున్న పనులు, ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అందరిని భాగస్వామ్యులను చేస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న తెలుగు వారిని సగౌరవంగా ఈ మహాసభలకి డిట్రాయిట్ ఆహ్వానిస్తున్నాము.

Share this Story:

Follow Webdunia telugu